Amit Shah : వచ్చే ఐదేళ్లలో ఒక్క అక్రమ వలసదారు కూడా ఉండడు.. అమిత్ షా సంచలనం!

అస్సాం అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఐదేళ్లలో అక్రమ చొరబాటుదారులను కేవలం ఓటర్ల జాబితా నుంచి తొలగించడమే కాకుండా, దేశం నుంచే తరిమివేస్తామని ఆయన స్పష్టం చేశారు.

New Update
Amit shah

అస్సాం అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఐదేళ్లలో అక్రమ చొరబాటుదారులను కేవలం ఓటర్ల జాబితా నుంచి తొలగించడమే కాకుండా, దేశం నుంచే తరిమివేస్తామని ఆయన స్పష్టం చేశారు. శనివారం అస్సాం పోలీస్ 10వ బెటాలియన్ కొత్త క్యాంపస్‌కు పునాది రాయి వేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అమిత్ షా నిప్పులు

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై అమిత్ షా నిప్పులు చెరిగారు. చొరబాటుదారులు కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకులుగా మారారని, అందుకే వారిని తొలగించే ధైర్యం ఆ పార్టీ చేయలేకపోతోందని విమర్శించారు. "దేశాన్ని నక్సలైట్ల నుంచి విముక్తం చేసినట్లే.. చొరబాటుదారుల నుంచి కూడా విముక్తం చేయవచ్చు. దీనికి ధైర్యం, సంకల్పం కావాలి.. అవి ప్రధాని మోదీ దగ్గర పుష్కలంగా ఉన్నాయి" అని ఆయన పేర్కొన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ కొత్త పోలీస్ క్యాంపస్‌ను చొరబాటుదారుల ఆక్రమణ నుంచి విడిపించిన స్థలంలోనే నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

వచ్చే ఐదేళ్లలో అస్సాం రాష్ట్రం తూర్పు, ఈశాన్య భారత దేశానికే పారిశ్రామిక కేంద్రంగా మారుతుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం ఆక్రమణలు తొలగిస్తే సరిపోదని, ప్రతి ఒక్క చొరబాటుదారుడిని గుర్తించి దేశం వెలుపలికి పంపడమే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. కాగా అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాలకు మార్చి-ఏప్రిల్ నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షా చేసిన ఈ ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisment
తాజా కథనాలు