భారత్-పాకిస్తాన్ మధ్య గత ఏడాది నెలకొన్న యుద్ధ పరిస్థితులపై ఇండియన్ నేవీ అధిపతి అడ్మిరల్ దినేష్ కే. త్రిపాఠి సంచలన విషయాలను వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' సమయంలో పాకిస్తాన్‌పై సముద్ర మార్గం ద్వారా దాడి చేసేందుకు భారత నేవీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఆయన తెలిపారు.
కొద్ది నిమిషాల్లోనే దాడి జరగాల్సింది..
ముంబైలో జరిగిన నావికాదళ పురస్కార ప్రదానోత్సవంలో అడ్మిరల్ త్రిపాఠి మాట్లాడుతూ.. "ఆపరేషన్ సిందూర్ సమయంలో మా బలగాలు పూర్తి అప్రమత్తతతో ఉన్నాయి. శత్రువుపై దాడికి కేవలం కొన్ని నిమిషాల దూరంలో ఉన్నాం. అయితే, ఆ సమయంలో దాడులను నిలిపివేయాలని పాకిస్తాన్ వైపు నుంచి అభ్యర్థనలు రావడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది," అని వివరించారు. ఒకవేళ పరిస్థితి మరింత తీవ్రంగా మారి ఉంటే.. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ కలిసి పాకిస్తాన్‌పై అతిపెద్ద సైనిక చర్యను చేపట్టి ఉండేవని ఆయన స్పష్టం చేశారు.
గత ఏడాది మే 6-, 7 తేదీల్లో భారత వైమానిక దళం పాక్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడి వందలాది మంది ఉగ్రవాదులను హతమార్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విశేష సేవలందించిన ఇద్దరు సీనియర్ నావికాదళ అధికారులకు అడ్మిరల్ త్రిపాఠి ఈ వేదికపై 'యుద్ధ సేవా పతకాన్ని' ప్రదానం చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హార్ముజ్ జలసంధి ప్రాంతంలో నౌకలపై దాడులు పెరగడం వల్ల అంతర్జాతీయ వాణిజ్యం దెబ్బతింటోందని పేర్కొన్నారు. గతంలో రోజుకు 130 నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో, ఇప్పుడు ఆ సంఖ్య కేవలం 6 నుంచి 7కి పడిపోవడం గమనార్హం.
operation sindhoor: పాక్‌పై దాడికి సిద్ధమైన ఇండియన్ నేవీ.. వెనక్కి తగ్గడానికి కారణం ఇదే!
ఇండియన్ నేవీ అధిపతి అడ్మిరల్ దినేష్ కే. త్రిపాఠి సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' సమయంలో పాకిస్తాన్‌పై సముద్ర మార్గం ద్వారా దాడి చేసేందుకు భారత నేవీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఆయన తెలిపారు.