/rtv/media/media_files/2026/04/11/jag-vikram-lpg-tanker-2026-04-11-19-56-55.jpg)
దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు చర్చలు విఫలమై ఇరాన్, అమెరికా యుద్ధం ఇంకా ముగియలేదు. హర్ముజ్ జలసంధిని ఆధీనంలోకి తీసుకుంటామని ట్రంప్ ప్రకటన మళ్లీ ఇప్పుుడు ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. హోర్ముజ్ జలసంధిలో ప్రస్తుత పరిస్థితులతో సుమారు 15 భారతీయ నౌకలు నిలిచిపోయినట్లు సమాచారం. భారతదేశానికి సరుకులను తీసుకువస్తున్న అనేక విదేశీ నౌకలు కూడా అక్కడ చిక్కుకుపోయాయి. అమెరికా జోక్యం వల్ల అంతర్జాతీయ నౌకా రవాణా స్తంభిస్తుందా లేదా సురక్షిత రాకపోకలకు మార్గం సుగమం అవుతుందా అనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
భారత జెండాతో ప్రయాణిస్తున్న ‘జగ్ విక్రమ్’ నౌక సుమారు 20,400 టన్నుల ఎల్‌పీజీని మోసుకొస్తోంది. ఇది ఏప్రిల్ 14, మంగళవారం నాటికి గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవుకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నౌకలో 24 మంది భారతీయ నావికులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత గ్యాస్ సంక్షోభ సమయంలో ఇంత పెద్ద మొత్తంలో ఇంధనం రావడం దేశీయ అవసరాలకు పెద్ద ఊరటనిస్తుందని భావిస్తున్నారు.
హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు
ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి వద్ద అమెరికా దిగ్బంధనాన్ని ప్రకటించడంతో నౌకా రవాణాపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ఉద్రిక్తతల మధ్యే, ఏప్రిల్ 11న ‘జగ్ విక్రమ్’ విజయవంతంగా హోర్ముజ్ జలసంధిని దాటి భారత మార్గంలో ప్రవేశించింది. మార్చి నెల ప్రారంభం నుండి పర్షియన్ గల్ఫ్ నుండి బయలుదేరిన తొమ్మిదవ భారతీయ నౌక ఇది.
Follow Us