కసబ్‌ కోసం రూ.28 కోట్లు ఖర్చు.. తహవూర్‌ రాణా కోసం ఎంత ఖర్చు చేయాలో ?

ముంబైలో ఉగ్రదాడికి పాల్పడ్డ కసబ్‌ కోసం జైల్లో రూ.28 కోట్లు ఖర్చు అయినట్లు తేలింది. అయితే తహవ్వుర్‌ రాణాకు విచారణలో ఆలస్యం జరిగితే అతడికి కూడా భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇలా జరగకుండా అతడిని వెంటనే ఉరితీయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

New Update
Kasab and Tahawwur Rana

Kasab and Tahawwur Rana

2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడి దేశ చరిత్రలో ఒక కిరాతక ఘటనగా నిలిచిపోయింది. ఇది జరిగి 16 ఏళ్లు గడిచిపోయాయి. ఈ మరణహోమం వెనకున్న ఉగ్రవాదుల్లో ఒకరైన తహవ్వుర్‌ రాణాను ఇండియాకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అదుపులో ఉన్నాడు. అయితే ఢిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టు రాణాను 18 రోజుల ఎన్‌ఐఏ కస్టడీకి పర్మిషన్ ఇచ్చింది.    

2008 నవంబర్ 26న తాజ్‌ హోటల్‌లో ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌తో పాటు ఇతర ఉగ్రవాదులు కలిసి ఈ మరణహోమం సృష్టించారు. ఈ దాడిలో ప్రాణాలతో బయటపడ్డ ఏకైక నిందితుడు కసబ్‌ను ఉరి తీసేందుకు చాలా కాలం పట్టింది. 2012లో నవంబర్ 21న ఉదయం 7.30 గంటలకు కసబ్‌ను ఉరితీశారు.  అయితే అతడికి జైల్లో ఉన్నప్పుడు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో తహవూర్‌ హుస్సేన్ రాణాకు ఇలాంటి వీఐపీ ట్రీట్‌మెంట్ ఇవ్వొద్దని ముంబై ఉగ్రదాడి బాధితులతో పాటు చాలామంది నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. 

Also Read: ఇదొక విచిత్రమైన లవ్ స్టోరీ.. ఫ్యాన్ రిపేర్ కోసం వచ్చి పాపను పడేశాడు!

 కసబ్‌ను అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి ఉరిశిక్ష విధించే వరకు అతడిపై ఎంత ఖర్చు పెట్టారనే వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా అథక్‌ సేవా అథక్ సేవా సంఘ్ ఛైర్మన్ అనిల్ గాల్గాలీ వివరాలు సేకరించారు. ఇందులో కసబ్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిపి మొత్తం రూ.28.46 కోట్లు ఖర్చు చేసినట్లు తేలింది. పుణెలోని యరవాడ జైలులో కసబ్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేశాయి. 

మహారాష్ట్ర ప్రభుత్వం కసబ్‌పై పెట్టిన ఖర్చు వివరాలను విడుదల చేసింది. ఆహారం కోసం రూ. 43,417.67, భద్రత:- రూ. 1,50,57,774.90, మెడిసిన్‌: రూ. 32,097, దుస్తులు: రూ. 2,047,  సెక్యూరిటీ: రూ. 5,25,16,542, అంత్యక్రియలు: రూ. 9,573, దుస్తులు: రూ. 2,047, సెక్యూరిటీ: రూ. 5,25,16,542, అంత్యక్రియలు: రూ. 9,573.. మొత్తం ఖర్చు రూ. 6,76,49,676.82. 

అయితే ఇప్పుడు ఎన్‌ఐఏ రిమాండ్‌లో తహవ్వుర్‌ రాణాకు కూడా ఎక్కువ కాలం విచారణ కొనసాగితే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ఖర్చులతో పోలిస్తే కసబ్‌కు పెట్టిన దానికన్న రాణాకు ఇంకా భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే అతడికి ఇలాంటి వీఐపీ ట్రీట్‌మెంట్ ఇచ్చి మేపాల్సిన అవసరం లేదని.. వెంటనే ఉరితీయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.

Also Read: స్కూల్ బ్యాగ్‌లో కండోమ్స్, తంబాకు ప్యాకెట్లు, కత్తులు, అగ్గిపెట్టలు.. ఎవర్రా మీరంతా!

ప్రస్తుతం, ఎన్‌ఐఏ రిమాండ్‌లో ఉన్న తహవూర్‌ రాణాకు సైతం విచారణ సుదీర్ఘ కాలం జరిగితే భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. నాటి కసబ్‌ పెట్టిన ఖర్చుతో పోలిస్తే తహవూర్‌ రాణాకు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే అతడికి ఇలాంటి వీఐపీ ట్రీట్‌మెంట్ ఇచ్చి మేపాల్సిన అవసరం లేదని.. వెంటనే ఉరితీయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.

ajmal-kasab | mumbai-attack | Tahawwur Rana 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు

జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌.. మోహన్ భగవత్ స్పందించారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోందని అన్నారు. పాకిస్థాన్ తప్పు చేసింది కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు.

New Update
Mohan Bhagwat

Mohan Bhagwat

జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌.. మోహన్ భగవత్ స్పందించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన  ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. '' పొరుగు దేశాలతో తమకు గొడవలు, యుద్ధం అవసరం లేదు. శాశ్వత శాంతి కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. కానీ వాళ్లు ఉగ్రదాడులు చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు దాడులతో సంబంధం లేదని చెబుతున్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోంది. పాకిస్థాన్ తప్పు చేసింది. కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. 

Also Read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

ఆరోజు రాముడు కూడా.. రావణాసురుడిని రాజ్య ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చంపారు. కానీ అది హింస కాదు. ఎవరైనా మాత్రం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అది తప్పు అని చెప్పి.. సరైన మార్గంలో నడిపించడమే రాజు బాధ్యత. ఇప్పుడు రాజు తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతాడని'' మోహన్ భగవత్ అన్నారు.   

Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..

అలాగే ఈ దాడి దేశ ప్రజలను ఎంతో వేదనకు గురిచేసిందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మనకు బలం లేకపోతో వేరే మార్గాన్ని ఎంచుకునే వాళ్లమని.. ఇప్పుడు మనం బలవంతులం కాబట్టి తప్పకుంటా మన బలమేంటో చూపించాలని మోహన్ భగవత్ అన్నారు. 

Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్‌ గాంధీ

Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

 mohan-bhagwat | attack in Pahalgam 

Advertisment
Advertisment
Advertisment