GDP: నెమ్మదించిన జీడీపీ...అయినా వేగంగా అభివృద్ధి

దేశ ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి కాస్త నెమ్మదించింది. నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో దేశీయోత్పత్తి 5.4 శాతం నమోదైంది. అయితే దేశ జీడీపీ తగ్గినప్పటికీ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ మాత్రం ముందు వరుసలోనే ఉంది. 

New Update
india

కేంద్ర గణాంక కార్యాలయం అయిన ఎన్‌ఎస్‌వో తాజాగా దేశ ఆర్ధిక వృద్ధికి సంబంధించి గణాంకాలను విడుదల చేసింది. ఇందులో థూల దేశీయోత్పత్తి తగ్గినట్లు తెలుస్తోంది. రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో దేశ జీడీపీ 5.4 శాతం నమోదైందని ఎన్‌ఎస్‌వో తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో 8.1 శాతంగా ఉంది. ముఖ్యంగా తయారీ రంగంలో భారత్ బాగా వెనుకపడిపోయింది. దీనిలో క్షీణత కారణంగానే వృద్ధి కూడా నెమ్మదించింది. అంతకు ముందు త్రైమాసికంలో జీడీపీ 6.7 శాతంగా నమోదైంది.

Also Read :  ఆ పాపం కేసీఆర్ దే.. సంతకంతో సహా సాక్ష్యాలు బయటపెట్టిన కాంగ్రెస్!

అయితే భారత్ జీడీపీ వృద్ధి రేటు తగ్గినప్పటికీ...వేగంగా అభివృద్ధి చెందుతోందని ఎన్‌ఎస్వో తెలిపింది. వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌ ముందు వరుసలో ఉందని చెప్పింది. ఇదే త్రైమాసికంలో పొరుగు దేశం చైనా 4.6 శాతం మాత్రమే వృద్ధి నమోదు చేసింది. దాంతో పోల్చుకుంటే భారత్ మెరుగ్గా ఉందని అంటోంది ఎన్‌ఎస్‌వో. 

ఇది కూడా చదవండి: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం!

 2022 అక్టోబర్‌- డిసెంబర్‌ త్రైమాసికంలో  స్థూల దేశీయోత్పత్తి కనిష్ఠంగా 4.3 శాతంగా ఉంది. ఇందులో
వ్యవసాయరంగ స్థూల విలువ జోడింపు (జీవీఏ) 3.5 శాతంగా ఉన్నట్లు కేంద్ర గణాంక కార్యాలయం తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది 1.7 శాతం ఉండగా..  తయారీ రంగం జీవీఏ 14.3 శాతంగా ఉంది. ఇక సమీక్షా త్రైమాసికంలో 2.2 శాతంగా నమోదైనట్లు గణాంక కార్యాలయం ప్రకటించింది. 

Also Read :  హైదరాబాద్ లో అరబ్ షేక్ ల అరాచకం.. 12 ఏళ్ల బాలికలతో కాంట్రాక్ట్ మ్యారేజ్‌

ఇది కూడా చదవండి: ఈ నెల 30న అకౌంట్లోకి డబ్బు జమ!

Advertisment
Advertisment
తాజా కథనాలు