/rtv/media/media_files/2025/04/09/G9hBRsn0DHHpEiLGcvZ0.jpg)
raffile fighter gets Photograph: (raffile fighter gets)
ఇండియా ఫ్రాన్స్ నుంచి మరోసారి రఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. ఈసారి 26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల భారత నావికాదళంలో చేరనున్నాయి. యుద్ధ విమానాల కొనుగోలుకు అనుమతి ఇస్తూ ఒప్పందాన్ని భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదించింది. ఈ ఒప్పందంలో 22 సింగిల్-సీటర్, 4 ట్విన్-సీటర్ రాఫెల్ మెరైన్ జెట్‌లు ఉన్నాయి. వీటి కోసం భారత్ రూ.63,000 కోట్ల విలువైన కాంట్రాక్ట్ ఫ్రాన్స్ ప్రభుత్వంతో చేసుకోనుంది.
Also read: Assembly: అసెంబ్లీ ముందే పొట్టు పొట్టు కొట్టుకున్న MLAలు (VIDEO)
News coming in...
— Vayu Aerospace Review (@ReviewVayu) April 9, 2025
India clears deal to buy 26 Rafale Marine from France. The G2G deal will be signed soon. Indian Navy to get 22 single seat and 4 twin seat aircraft.
Waiting for the official confirmation.
📷VAYU. IAF Rafale at Aero India'25. pic.twitter.com/qVdyquSOCJ
ఏప్రిల్ చివరిలో ఫ్రెంచ్ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకోర్ను భారతదేశ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉంది. ఒప్పందంపై సంతకం చేసిన 5 సంవత్సరాల తర్వాత రాఫెల్ M జెట్‌ల డెలివరీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ రఫెల్ మెరైన్ ఫైటర్ జెట్లు భారతదేశంలో మొట్టమొదటిగా స్వదేశీ టెక్నాలజీతో నిర్మించిన INS విక్రాంత్‌లో మోహరించబడతాయి. ప్రస్తుతం నేవీ MiG-29K విమానాలతో పనిచేస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఇప్పటికే అంబాలా, హషిమారా ఎయిర్ బేస్‌లో 36 రాఫెల్ జెట్లు ఉన్నాయి.