/rtv/media/media_files/2026/02/18/shapur-kandi-barrage-2026-02-18-18-10-03.jpg)
ఎండాకాలం పొరుగు దేశం పాకిస్తాన్‌ను ఎండబెట్టెలా చేసింది ఇండియా. ఉగ్రవాదాన్ని మన దేశంపైకి ఉసిగొలిపే పాకిస్థాన్‌కు గట్టి షాక్ ఇచ్చింది. సింధు నదీ జలాల ఒప్పందంలో భాగంగా మన వాటాకు వచ్చిన రావి నది నీరు ఇకపై ఒక్క చుక్క కూడా పాక్‌కు వెళ్లకుండా భారత్ పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేస్తోంది. పంజాబ్-జమ్మూ కశ్మీర్ సరిహద్దులో దాదాపు 45 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న షాపుర్కండి బ్యారేజీ నిర్మాణం పూర్తి కావడమే ఇందుకు ప్రధాన కారణం. పాకిస్థాన్ వ్యవసాయం 80 శాతానికి పైగా సింధు నదీ వ్యవస్థపైనే ఆధారపడి ఉంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాక్‌కు, భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వేసవిలో తీవ్ర నీటి ఎద్దడిని కలిగిస్తుంది. ముఖ్యంగా లాహోర్ వంటి నగరాల్లో తాగునీటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతేడాది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ 'ఆపరేషన్ సింధూర్' చేపట్టి, సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. "రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు" అన్న ప్రధాని మోదీ నినాదానికి అనుగుణంగా, భారత్ తన జలవనరులపై పట్టు సాధించడం వ్యూహాత్మకంగా అత్యంత కీలకంగా మారింది.
🚨 HUGE! India set to BLOCK excess water flowing to Pakistan from the Ravi river.
— Megh Updates 🚨™ (@MeghUpdates) February 16, 2026
The Shahpur Kandi project is expected to be COMPLETED next month, with a March 2026 DEADLINE to STOP WATER OUTFLOW to Pakistan 🔥 pic.twitter.com/l4sSelBR2a
రావి నీరు.. ఇక మన రైతులకే!
1960 నాటి సింధు జలాల ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్‌కు సంపూర్ణ హక్కులు ఉన్నాయి. అయితే, రావి నదిపై సరైన నిల్వ సౌకర్యాలు లేకపోవడంతో ఇన్నాళ్లూ మన వాటా నీరు వృథాగా పాకిస్థాన్‌లోకి ప్రవహించేది. మార్చి 31, 2026 నాటికి షాపుర్కండి బ్యారేజీ పనులు పూర్తి కానుండటంతో, ఏప్రిల్ నుంచి ఆ మిగులు జలాలను భారత్ తన సొంత అవసరాలకు మళ్లించనుంది.
ప్రాజెక్టు ప్రత్యేకతలు
సాగునీరు: ఈ ప్రాజెక్టు ద్వారా జమ్మూ కశ్మీర్‌లోని కరువు పీడిత ప్రాంతాలైన కథువా, సాంబా జిల్లాల్లో సుమారు 32,173 హెక్టార్ల భూమికి సాగునీరు అందనుంది. అలాగే పంజాబ్‌లో మరో 5,000 హెక్టార్లకు లబ్ధి చేకూరుతుంది.
విద్యుత్ ఉత్పత్తి: సాగునీటితో పాటు ఈ డ్యామ్ ద్వారా దాదాపు 206 మెగావాట్ల జల విద్యుత్తును ఉత్పత్తి చేయనున్నారు.
జలవనరుల నిర్వహణ: ఇన్నాళ్లూ వృథాగా పోతున్న సుమారు 1,150 క్యూసెక్కుల నీటిని ఇకపై భారత్ తన ప్రయోజనాల కోసం వాడుకోనుంది.
Follow Us