Vijay Devarakonda : ‘నా బెస్ట్ ఫ్రెండ్‌ను భార్యగా చేసుకున్నా’.. పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన విజయ్‌

టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు తమ వివాహ ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన తమ డెస్టినేషన్ వెడ్డింగ్ ఫోటోలను ఎక్స్ లోపంచుకున్నారు.

New Update
FotoJet (10)

I made my best friend… my wife

Vijay Devarakonda : టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు ఇరువురు తమ వివాహ ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో  జరిగిన తమ డెస్టినేషన్ వెడ్డింగ్ ఫోటోలను ఇరువురు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.

‘గీత గోవిందం’ సినిమాలో కలిసి నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ఆ చిత్రంలో మాదిరిగానే నిజజీవితంలోనూ పెళ్లితో ఒకటయ్యారు. కొన్నేళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట తమ మధ్య ప్రేమను ఎక్కడ వ్యక్తం చేయలేదు. కానీ, చాలాకాలంగా వారిద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయం అనేకసార్లు రుజువైంది. తమ ఎంగేజ్ మెంట్‌ విషయాన్ని కూడా ఆ జంట బయటికి చెప్పలేదు. అయతే ఎట్టకేలకు ఇటీవలే ‘మేము ఒక్కటి కాబోతున్నాం’ అని ప్రకటించి సస్పెన్స్‌కు తెరదించింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26 ఉదయం 10.10 గంటలకు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుందీ స్టార్ కపుల్. కొద్దిమంది ఆహ్వానితులు, సన్నిహితుల సమక్షంలో సందడిగా సాగిన తమ విరోష్‌ కల్యాణ వేడుక ఫోటోలను విజయ్, రష్మికలు ఎక్స్‌ వేదికగా పంచుకోవడం విశేషం.

‘ఒకరోజు నేను తనను మిస్ అయ్యాను. తను నా పక్కన ఉంటే నా రోజంతా గొప్పగా మారుతుంది. తను నా పక్కన కూర్చుంటే నా భోజనం సంతృప్తిగా అనిపిస్తుంది. తను నాతో కలిసి వర్కవుట్లు చేస్తుంటే అవి శిక్షలా కాకుండా ఎంతో ఫన్నీగా అనిపిస్తాయి. తను నాకు చాలా అవసరం. నేను ఎక్కడ ఉన్నా సరే తను పక్కన ఉంటే ఇంట్లో ఉన్నట్టుగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. సో.. నా బెస్ట్ ఫ్రెండ్‌ను నా భార్యగా చేసుకున్నా’ అని విజయ్ దేవరకొండ ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

Advertisment
తాజా కథనాలు