/rtv/media/media_files/2025/03/22/HNT8U2pkQBOQSjB4IYCo.jpg)
ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లాకు అరుదైన గౌరవం దక్కింది. శనివారం ఆయన 59వభారత అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీతగా ఎంపికయ్యారు. ప్రముఖ కథకురాలు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ప్రతిభా రే అధ్యక్షతన జరిగిన జ్ఞానపీఠ ఎంపిక కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు .హిందీ సాహిత్యం, సృజనాత్మకత, విలక్షణమైన రచనా శైలికి ఆయన చేసిన అద్భుతమైన కృషికి గాను ఈ గౌరవాన్ని ఆయనకు ప్రదానం చేస్తున్నామని కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
Also read : ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్లపై డీబీజీఐ ఉక్కుపాదం.. 2400 అకౌంట్లు ఫ్రీజ్
Vinod Kumar Shukla, a well-known Hindi writer, has been selected for the 59th Jnanpith Award.
— All India Radio News (@airnewsalerts) March 22, 2025
His famous novels are 'Naukar Ki Kameez' and 'Deewar Mein Ek Khidki Rahti Thi.'#VinodKumarShukla #JnanpithAward #HindiLiterature #NaukarKiKameez #LiteraryAward #HindiWriter pic.twitter.com/JQffJfxwbA
ఛత్తీస్‌గఢ్ నుండి మొదటి రచయిత
కాగా ఛత్తీస్‌గఢ్ (chhattisgarh) నుండి ఈ అవార్డును అందుకున్న మొదటి రచయిత ఆయనే కావడం విశేషం. ఈ అవార్డును అందుకున్న 12వ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా. ఆయనకు అవార్డుతో పాటు ఆయనకు రూ. 11 లక్షల నగదు బహుమతి, హిందూ విద్యా దేవత సరస్వతి కాంస్య విగ్రహం, ప్రశంసా పత్రం అందజేస్తారు. శుక్లా 1999లో తన దీవార్ మే ఏక్ ఖిర్కీ రహతి థి అనే పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. 1961లో స్థాపించబడిన జ్ఞానపీఠ్ అవార్డును మలయాళ కవి జి. శంకర కురుప్‌కు 1965లో ఒడక్కుఝల్ అనే కవితా సంకలనానికి అందుకున్నారు. ఇది కేవలం భారతీయ రచయితలకు మాత్రమే ఇవ్వబడుతుంది.
Also read : ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓ సన్నాసి.. కేసీఆర్ సంచలన కామెంట్స్
Also read : బాలయ్య వేస్ట్.. ఆ విషయంలో నేనే బెస్ట్.. కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్!