/rtv/media/media_files/2025/04/01/Ro3Nfszv6t8rYzwO3Tgp.jpg)
gujarath crime
Crime News: గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బనస్కాంత జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ప్రమాదంలో భవనం కుప్పకూలింది. పేలుడు దాటికి 17 మంది మృతి చెందాగా.. ఆరుగురు గాయపడ్డారు. గాయ పడిన క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తునట్లు జిల్లా పరిపాలన అధికారి తెలిపారు. దీసా పట్టణానికి సమీపంలో ఉన్న బాణసంచా కేంద్రంలో మంగళవారం జరిగిన ఈ ఘటనతో నగర వాసులు భయంతో పరుగులు తీశారు.
गुजरात की एक पटाखा फैस्ट्री में ब्लास्ट से झुलसे 10 मजदूर, मौके पर मौतhttps://t.co/k4syHCKzq5@BJP4Gujarat #gujarat #banaskantha #firecrackerfactory #Noida #Fire #KhabarFast #KhabarFastDigital pic.twitter.com/j4qhBe2LLW
— KHABAR FAST (@Khabarfast) April 1, 2025
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం సహాయక చర్యలు చెపట్టారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ ప్రమాదం జరగటంతో ఇన్‌స్పెక్టర్ విజయ్ చౌదరి ఆధ్వర్యంలో ప్రమాద స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీంచారు. మృతుల వివరాలపై ఆరా తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
కార్మికులు మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం ఆందోళన చెందుతున్నారు. 17 మంది ఒక్కసారి చనిపోవటంతో బనస్కాంత నగరం అంతా విషాదఛయాలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: శరీరంలో విటమిన్ K లోపం ఉంటే రక్తస్రావం తప్పదా?