చెన్నైలో ట్రైన్ యాక్సిడెంట్..ఢీ కొట్టుకున్న గూడ్స్, ఎక్స్‌ప్రెస్ చెన్నైలో రైలు ప్రమాదం జరిగింది. తిరువళ్ళూరు జిల్లా కవారిపేట్ రైల్వే స్టేషన్ సమీపంలో నిలబడి ఉన్న గూడ్స్‌రైలును ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనల మూడు భోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. పలువురికి గాయాలయ్యాయని తెలుస్తోంది. By Manogna alamuru 11 Oct 2024 | నవీకరించబడింది పై 11 Oct 2024 23:36 IST in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Train Accident: చెన్నైలో రైలు ప్రమాదం జరిగింది. తిరువళ్ళూరు జిల్లా కవారిపేట్ రైల్వే స్టేషన్ సమీపంలో నిలబడి ఉన్న గూడ్స్‌రైలును ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనల మూడు భోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. పలువురికి గాయాలయ్యాయని తెలుస్తోంది. ప్రమాదానికి గురైన రైలు మైసూరు - దర్భంగా మధ్య నడిచే భాగమతి ఎక్స్‌ప్రెస్‌గా తెలుస్తోంది. పట్టాలపై నిలబడి ఉన్న సరకు రవాణా రైలును అతి వేగంగా వచ్చిన ఎక్స్‌ప్రెస్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. అదృష్టవశాత్తు ప్రాణాపాయం జగరలేదు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి ప్రమాద స్థాయి పెరగకుండా ఈ దారిలో వెళ్ళే రైళ్ళను రైల్వే అధికారులు దారి మళ్లించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రైల్వే అధికారులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చెన్నై రైల్వే డివిజన్ అధికారులు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు 04425354151, 04424354995 ఏర్పాటు చేశారు. రాత్రి 8.27 గంటల సమయంలో పొన్నేరి స్టేషన్ దాటిన రైలుకు కవరైప్పెట్టై స్టేషన్‌లో మెయిన్ లైన్‌లో వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ.. స్టేషన్‌లోకి రైలు ఎంటర్ అవుతున్న టైమ్‌లో భారీ కుదుపు ఏర్పడినట్లు రైలు సిబ్బంది గుర్తించారు. తర్వాత మెయిన్ లైన్‌లో వెళ్లాల్సిన రైలు.. లూప్ లైన్‌లో వెళ్లి అక్కడ ఆగివున్న గూడ్స్ రైలును ఢీకొట్టినట్లు అధికారులు చెప్పారు. భాగమతి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ లోని ప్రయాణికులను సురక్షితంగా తరలించేందుకు వీలుగా బస్సులు, తాగునీరు లాంటి మౌలిక వసతులు తిరువళ్లూరు జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. Also Read: ఎట్టకేలకు మహదేవ్ బెట్టింగ్ యాప్ ఓనర్, మాస్టర్ మైండ్ సౌరభ్ అరెస్ట్ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి