గల్గోటియాస్ రోబోట్ వివాదం.. నేహా సింగ్ Open To Work పోస్ట్ వైరల్!

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురైన గల్గోటియాస్ యూనివర్సిటీ ఆఫీసర్ నేహా సింగ్ సడెన్‌గా లింక్డ్‌ఇన్‌లో ప్రత్యక్షమయ్యారు. ఆమె ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఓపెన్‌ టూ వర్క్ అని పోస్ట్ పెట్టారు.

New Update
Galgotias Rep Neha Singh

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురైన గల్గోటియాస్ యూనివర్సిటీ ఆఫీసర్ నేహా సింగ్ సడెన్‌గా లింక్డ్‌ఇన్‌లో ప్రత్యక్షమయ్యారు. ఆమె ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఓపెన్‌ టూ వర్క్ అని పోస్ట్ పెట్టారు. భారత్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో తెలిసి తెలియని నాలడ్జ్‌తో ఆమె ఏది పడితే అది వాగారు. చైనాలో తయారు చేసిన రోబో డాగ్ తమ యూనివవర్సిటీ తయారు చేసినట్లు చెప్పుకొచ్చారు.

ఆమె చేసిన పనికి ప్రపంచవ్యాప్తంగా ఇండియా పరువు పోయింది. చైనా తయారు చేసిన రోబో డాగ్‌ను తమ యూనివర్సిటీ తయారు చేసిందని నేహా సింగ్ చెప్పారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంటర్నేషనల్ టెక్ కమ్యూనిటీ ఆ రోబో డాగ్ చైనా మానిఫ్యాక్చర్ చేసిందని.. వారి దాన్ని కొన్నారని కనిపెట్టింది. ఈ విషయాన్ని ట్రోల్ చేస్తే ఇంటర్‌నెట్‌లో చేశారు. దీంతో యూనివర్సిటీని సమ్మిట్ నుంచి బహిక్షరించారు. ఆ యూనివర్సిటీ ఆమెపై యాక్షన్ తీసుకుంది. నేహా సింగ్‌ను సస్పెండ్ చేశారు. ఇప్పుడు తన ప్రొఫైల్ పిక్చర్‌కు Open To Work అనే ఫ్రేమ్‌ను జోడించడం చర్చనీయాంశమైంది. ఆమె ఓపెన్ టూ వర్క్ అని పెట్టిన పోస్ట్ ఫోటొ కూడా ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఆమెకు జాబ్ దొరకడం కష్టం అని హేళన చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు