/rtv/media/media_files/2025/03/02/OqvfKCAw0Z1CVHLUFLUe.jpg)
1980 పాస్‌పోర్ట్ నిబంధనల్లో కేంద్రం పలు కీలక మార్పులు తీసుకువచ్చింది. 2023 అక్టోబర్ 1 తరువాత పుట్టిన వారందరూ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు తప్పనిసరిగా బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. జనన మరణాల ధృవీకరణకు రిజిస్ట్రార్, మున్సిపల్ కార్పొరేషన్ లేదా సంబంధిత అధికారి జారీ చేసిన సర్టిఫికెట్ సమర్పించవచ్చని వెల్లడించింది.
Birth certificate now mandatory for passports, Aadhaar, voter ID & more for those born after Oct 1, 2023!
— shorts91 (@shorts_91) March 1, 2025
Read more on https://t.co/oRaP5ODMdH#India #NewRules #BirthCertificate #Aadhaar #VoterID #Passport #DrivingLicense #GovtPolicy #DigitalIndia #RuralChallenges pic.twitter.com/4K0G05O5Ar
Also Read : వారానికి ఒకసారి బొప్పాయి ఆకుల రసం తాగితే ప్రయోజనాలు
Also read : న్యూజిలాండ్‌తో మ్యాచ్.. విరాట్ కోహ్లీ అరుదైన ఫీట్!
2023 అక్టోబరు 1కి ముందు జన్మించిన వారు
అలాగే 2023 అక్టోబరు 1కి ముందు జన్మించిన వారు జనన తేదీకి రుజువుగా.. డ్రైవింగ్ లైసెన్స్, పాఠశాల ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టీసీ) లేదా సంబంధిత అధికారి ద్వారా జారీ అయిన పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. కాబట్టి గ్రామీణులకు ఇవి పెద్దగా ఇబ్బంది కలగించవని అధికారులు స్పష్టం చేశారు.1967 పాస్‌పోర్ట్ చట్టంలోని సెక్షన్ 24లోని నిబంధనల ప్రకారం పాస్‌పోర్ట్ నియమాలను సవరించినట్లు ఫిబ్రవరి 24న విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ప్రస్తుతం భారత్ లో మూడు రకాల పాస్‌పోర్ట్‌లు జారీ చేయబడుతున్నాయి: సాధారణ, అధికారిక, దౌత్య. సాధారణ పాస్‌పోర్ట్ సాధారణ పౌరులకు ఇస్తారు. ఇది 10 సంవత్సరాలు చెల్లుబాటు అవుతుంది. ప్రభుత్వ అధికారులు విదేశీ ప్రయాణాలకు అధికారిక పాస్‌పోర్ట్ జారీ చేస్తారు. ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు, దౌత్యవేత్తలకు దౌత్య పాస్‌పోర్ట్ జారీ చేయబడుతుంది.
Also Read : దారుణ హత్య... సూట్‌కేస్‌లో కాంగ్రెస్ మహిళా కార్యకర్త డెడ్ బాడీ!
Also read : ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీకొని 37 మంది మృతి