11 రూ. లకే ఐఫోన్ 13 కేవలం ముగ్గురికే ..ఫ్లిప్ కార్ట్ ఏం చెప్పింది?

ఐఫోన్ 13 కేవలం 11 రూ.లకే అంటూ ప్రచారం చేసింది ఫ్లిప్ కార్ట్. ప్రమోషన్స్‌తో ఉదరగొట్టింది. తీరా సేల్ స్టార్ట్ అయ్యాక కేవలం ముగ్గురికి మాత్రమే ఈ డీల్ వచ్చింది. మరి ఇలా ఎందుకు జరిగింది? ఫ్లిప్ కార్ట్ ఏం చెబుతోంది? కింది ఆర్టికల్‌లో ...

author-image
By Manogna alamuru
New Update
sale

Flip Kart Sale, Iphone 13: 

ఫ్లిప్ కార్ట్ అంటే ప్రస్తుతం వినియోగదారులు మండిపడుతున్నారు. బిగ్ బిలియన్ డేస్‌లో భాగంగా ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ అనే పేరు మీద ఐఫోన్ 13 ను 11 రూ.లకే ఇస్తానని ప్రకటించింది. ప్రమోషన్స్‌తో తెగ ఊదరగొట్టింది. దీంతో చాలా మంది ఐఫోన్ 13 ను సొంతం చేసుకొందామని ప్రయత్నాలు చేశారు. రాత్రి 11 గంటల నుంచి బుకింగ్‌ల కోసం ఎగబడ్డారు. 11 రూ.లకే ఐఫోన్ కొనుక్కుందామని కలలు కన్నారు. కానీ తీరా చూస్తే అందరికీ తీవ్ర నిరాశ ఎదురైంది. కేవలం ముగ్గురంటే ముగ్గురే లక్కీ ఫెలోస్‌గా తేలారు. మిగతా అందరికీ ఫ్లిప్ కార్ట్ మొండిచెయ్యే చూపించింది. కొంతమందికి ఉత్పత్తి ఆగిపోయింది అని..కొంతమందికి స్టాక్ అయిపోయింది అని...మరి కొంత మందికి టెక్నికల్ ప్రాబ్లెమ్ అంటూ చూపించింది. ఒకు 11రూ.లకు ఫో కొన్నారు. కానీ ఫ్లిప్ కార్ట్ ఆ ఆర్డర్‌‌ను కూడా రద్దు చేసేసింది. దీంతో వినియోగదారులు మండిపడిపోతున్నారు. ఫ్లిప్ కార్ట్ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇదో పెద్ద మార్కెట్ మోసం, జిమ్మిక్కు, అతి పెద్ద స్కామ్ , అన్యాయం అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్ట్‌లు పెడుతున్నారు. దీని మీద విచారణ జరపాలి అని అడుగుతున్నారు. మరికొంత మంది అయితే ఏకంగా ఫ్లిప్ కార్ట్ వినియోగదారులను మానసికంగా వేధిస్తోంది అంటూ వాపోయారు కూడా.

 

 

 

 

అయితే దీనిని ఫ్లిప్ కార్ట్ మాత్రం చాలా కూల్‌గా తీసుకుంది. ఆఫర్ గురించి మీ తాపత్రయం మేము అర్ధం చేసుకున్నాము. మేము పెట్టిన ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫాస్ట్‌ను కేవలం ముగ్గురు మాత్రమే క్లెయిమ్ చేసుకున్నారు. అందుకే వారికే ఫోన్ ఇచ్చాము అని చెప్పింది. అయితే ఇలాంటి ఆఫర్లు ఇంకా బిగి బిలియన్ డేలో మరిన్ని వస్తాయి. ఓపికగా ఉండి మీకు కావాల్సినవి పొందండి అని ఒక కస్టమర్‌‌కు సమాధాన చెప్పింది ఫ్లిప్ కార్ట్. ప్రతీ రోజూ 9 నుంచి 1 వరకు వెబ్ సైట్ చూడండి అంటోంది. 

 Also Read: Weather: తెలంగాణాలో 14 జిల్లాలకు ఎల్లో అలెర్ట్

Advertisment
Advertisment
తాజా కథనాలు