ఢిల్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిపై కేసు నమోదైంది. మహిళను లైంగికంగా వేధించినందుకు దినేష్ మోహానియాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎన్నికల ప్రచారంలో దినేష్ మోహానియా ఒక మహిళకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మహిళ ఫిర్యాదు మేరకు సంగం విహార్ పోలీసులు అతనిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. మహిళ ఫిర్యాదుపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి తదుపరి చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతానికి, ఈ విషయంపై దినేష్ మోహానియా నుండి ఎటువంటి ప్రకటన వెలువడలేదు.
#Arvindkejriwal #DineshMohaniya महिलाओं के अपमान के लिए माफ़ी मांगों #DelhiElection2025 #Delhi #NewDelhi #BJP4Delhi #AAP_हटाओ_दिल्ली_बचाओ https://t.co/D43WSwbMEg
— MITR (@mitr1540860) February 3, 2025
దక్షిణ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో సంగం విహార్ ఒకటి. ఇక్కడి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్‌పై దినేష్ మోహానియా హ్యాట్రిక్ సాధించారు. ఆ పార్టీ నుంచి మోహానియా నాల్గవసారి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి చందన్ కుమార్ చౌదరిని, కాంగ్రెస్ హర్ష్ చౌదరిని పోటీకి నిలిపింది. 2016 జూన్ 23న మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలతో ఎమ్మెల్యే మోహానియాపై కేసు నమోదైంది.
ఢిల్లీ ఎన్నికలు ప్రారంభం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఢిల్లీలోని 70 స్థానాలకు పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఢిల్లీలోని 1.56 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుని దాదాపు 700 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఫిబ్రవరి 8న ఫలితాలు ప్రకటించనుంది ఈసీ. ఆమ్ ఆద్మీ పార్టీ మూడోసారి అధికారం చేపట్టే దిశగా ప్రచారాన్ని చేయగా... బీజేపీ, కాంగ్రెస్ కూడా ఢిల్లీ సింహాసనాన్ని కైవసం చేసుకోవడానికి బాగానే కష్టపడ్డాయి. 25 సంవత్సరాలకు పైగా అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ.. ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతుంది. గత రెండు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్ ఈ సారి ఎలాగైనా గెలవాలని గట్టిగానే ప్రచారం చేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు 13,766 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు.
Also Read : నేడు మహాకుంభమేళాకు మోదీ.. షెడ్యూల్ ఇదే!