/rtv/media/media_files/2025/04/02/MigFgpPIij9hI9Cj0beI.jpg)
organs of farmers
మహరాష్ట్రలో ఓ రైతు తన అప్పులు తీర్చుకోవడానికి వినూత్న రీతిలో రోడ్డెక్కాడు. పంటలు చేతికి అందక అప్పులపాలైన రైతు తన అవయవాలను అమ్మకానికి పెట్టాడు. కిడ్నీ రూ.75,000, కాలేయం రూ.90,000, కళ్లు రూ.25,000కు అమ్ముతానంటూ ఓ ప్లకార్డు పట్టుకొని నిరసన ప్రదర్శించాడు. మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అదోలి గ్రామానికి చెందిన సతీశ్ ఐదోలు వ్యవసాయంలో నష్టపోయాడు. దీంతో బ్యాంకు రుణాలు తీర్చలేకపోయాడు. ఈ నేపథ్యంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంపై వినూతన్నంగా నిరసన తెలిపాడు. ఎన్నికలకు ముందు రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దానిని నెరవేర్చలేదని ఆరోపించాడు.
'Kidney For ₹75K, Liver For ₹90K..': Financially Burdened Farmer Puts Organs On Sale In Maharashtra's Washim.
— PUNEET VIZH (@Puneetvizh) April 2, 2025
Satish Idole, a resident of Adoli village, carried a placard around his neck listing prices for his body parts. His protest was directed at the Devendra Fadnavis-led… pic.twitter.com/n7DjmBeNIQ
రైతుల అవయవాలు కొనండని రాసిన బోర్డును మెడకు తగిలించుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. తన కిడ్నీలను రూ.75,000కు, కాలేయాన్ని రూ. 90,000కు, కళ్లు రూ. 25,000కు అమ్ముతానని అందులో రాసుకున్నాడు ఆ రైతు. అయితే రైతు సతీశ్ వినూత్న నిరసన అక్కడున్న వారిని ఆకట్టుకున్నది. సతీశ్ నిరసన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొన్ని గంటల్లోనే ఆ వీడియో వైరల్ అయ్యింది. రైతు రుణమాఫీ పై మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై రైతు సతీశ్ మండిపడ్డాడు. అతనికి ఉన్న అప్పులు తీర్చడానికి తన కుటుంబ సభ్యుల అవయవాలు కూడా అమ్మకానికి పెట్టినట్లు చెప్పాడు. రైతులకు రుణ మాఫీపై ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సతీశ్ కోరాడు. ఈ మేరకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఒక లేఖ రాశాడు. దాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేశాడు.
Also read: Waqf Board Bill: ఇండియాలో ఆ 9లక్షల 40వేల ఎకరాల భూమి ఎవరిది.. వక్ఫ్ బోర్డ్ కథేంటి..?