Ratan TATA: విజన్, దాతృత్వానికి పెట్టింది పేరు–రతన్ టాటా టాటాలు అంటేనే వ్యాపారానికి పెట్టింది పేరు. అలాంటి కుటుంబంలో పుట్టిన రతన్...ఆ కుటుంబ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. వ్యాపారానికి విలువలను ఆపాదించిన అతి తక్కువ వ్యాపారవేత్తలో రతన్ టాటా ఉంటారు. దాతృత్వానికి పెట్టింది పేరు రతన్ టాటా. By Manogna alamuru 10 Oct 2024 | నవీకరించబడింది పై 10 Oct 2024 00:57 IST in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Ratan TATA: 1937 డిసెంబర్ 28 న ముంబైలో జన్మించారు. పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబంలో ఆయన పుట్టారు. భారత దేశ ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు. 1990 నుండి 2012 వరకు టాటా గ్రూప్ కి చైర్మన్ గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుండి ఫిబ్రవరి 2017 వరకు టాటా గ్రూప్ కు తాత్కాలిక ఛైర్మన్ గా వ్యవహరించారు. చనిపోయేంత వరకూ టాటా ఛారిటబుల్ ట్రస్టులకు అధిపతిగా రతన్ టాటా వ్యవహరించారు. టాటా సన్స్ బాధ్యతలు తీసుకోక ముందు టాటా గ్రూప్ కంపెనీ అయి టాటా ఇండస్ట్రీలో అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ తర్వాత కొన్ని నెలలపాటు జంషెడ్‌పూర్‌లోని టాటా ప్లాంట్‌లో శిక్షణ తీసుకున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత, రతన్ టాటా గ్రూప్ బాధ్యతలను తీసుకున్నారు. నానో కార్ రతన్ టాటా కలల కార్ అని చెబుతారు ఆయన ఇచ్చిన ఐడియాల ప్రకారమే దానిని తయారు చేశారు. అతి తక్కువ ధరకే లభించిన నానో కార్స్ కొన్నేళ్ళు ఇండియన్ మార్కెట్లో తెగ సేల్స్ అయ్యాయి. తరువాత నానో కార్ ప్రొడక్షన్ ఆపేశారు. అయితే ఇప్పుడు దాని అప్డేటెడ్ వెర్షన్ నానో ఈవీలను మార్కెట్లోకి తీసకురానున్నారని తెలుస్తోంది. దేశ అత్యున్నత పౌర పురస్కారాలు పద్మవిభూషణ్ (2008), పద్మభూషణ్ (2000) లను అందుకున్నారు. Titan clocks stopped today.#RatanTata , the visionary who steered Tata Sons into a global powerhouse, has passed away at 86. End of an Era. Rest in Power 🙏 pic.twitter.com/Apbz0xvaK7 — Hamim Seikh (@HamimSeikhLive) October 9, 2024 రతన్ టాటా టాటా వ్యవస్థాపకుడు జమ్‌షడ్జీ మునిమనువడు. ఈయన కార్నెల్ యూనివర్శిటీకాలేజీ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి డిగ్రీని పొందారు. దాని తరువాత హార్వర్డ్ యూనివర్శిటీలో కూడా పట్టా అందుకున్నారు. 1961లో టాటా కంపెనీలో చేరారు. మొదట అసిస్టెంట్‌గా పని చేఆరు. కొంత అనుభవం వచ్చాక. టాటా సన్స్‌లో శిక్షణ పొందాక దాని బాధ్యతలను తీసుకున్నారు. 1991లో జెర్డీ టాటా పదవీ విరమణ చేశాక రతన్ వారసుడిగా బాధ్యతలు చేపట్టారు. టాటాను భారత కేంద్రీకృత సమూహం నుండి ప్రపంచ వ్యాపారంగా మార్చారు. ఈయన హయాంలోనే ఐకానిక్ గ్లోబల్ బ్రాండ్ సంస్థలైన టెట్లీ(టాటా టీ), జాగ్వార్ ల్యాండ్ రోవర్(టాటా మోటర్స్), కోరస్ స్టీల్ ను(టాటా స్టీల్) టాటా సొంతం చేసుకుంది. 75 ఏళ్లు నిండిన తర్వాత, రతన్ టాటా 28 డిసెంబర్ 2012న టాటా గ్రూపులో తన కార్యనిర్వాహక అధికారాలకు రాజీనామా చేశారు. Titan clocks stopped today.#RatanTata , the visionary who steered Tata Sons into a global powerhouse, has passed away at 86. End of an Era. Rest in Power 🙏 pic.twitter.com/Apbz0xvaK7 — Hamim Seikh (@HamimSeikhLive) October 9, 2024 అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలుతున్నా...దేశాన్ని శాసించే డబ్బులు ఉన్నా రతన్ టాటా ఎప్పుడూ డౌన్ టూ ఎర్త్‌గానే ఉండేవారు. దాతృత్వంలో రతన్‌ను మించిన వారు లేరు. వ్యాపారంలో డబ్బులు సంపాదించడమే టార్గెట్‌గా కాకుండా..నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు అందిస్తూ దేశ ప్రజల గుండెల్లో చిరస్థానం సంపాదించుకున్నారు. పేదలకు కోట్ల రూపాయల దానం చేశారు ప్రపంచ వ్యాపార రంగంలో అత్యున్నత స్థాయిలను అందుకున్నారు. కొత్తదనాన్ని, కొత్త తరాన్ని ప్రోత్సహించడంలో రతన్ ఎప్పుడూ ముందుడేవారు. ప్రపంచంలోని చౌకైన కారుని తీసుకొచ్చిన ఘనత రతన్ టాటాకే దక్కుతుంది. భారతదేశంలోని మిలియన్ల మంది ప్రజలకు మోటార్ సైకిళ్ళకు ప్రత్యామ్నాయంగా.. సరసమైన, సురక్షితమైన కార్‌ను అందించడంలో రతన్ సక్సెస్ అయ్యారు. కారు కొనుక్కోవాలనే ఎంతో మంది కలను సాకారం చేశారు. "I want to be remembered as..."What was Ratan Tata's biggest moment of despair, his biggest achievement, and how he wanted to be remembered? Find out in this video#ratantata #tata #ratan #rip #ripratantata #breakingnews #cnbctv18digital pic.twitter.com/vJ016o1sgw — CNBC-TV18 (@CNBCTV18News) October 9, 2024 #ratan-tata మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి