Karnataka: ముడా కుంభకోణంలో కర్ణాటక సీఎంపై ఈడీ కేసు

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్ తగిలింది. ముడా కుంభకోణంలో మనీ లాండరింగ్ కు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసింది. ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామిపై సైతం ఈడీ కేసు నమోదు కావడం కన్నడ పాలిటిక్స్ లో సంచలనంగా మారింది.

author-image
By Manogna alamuru
New Update
PM Modi : మోదీ.. ప్రజల మనోభావాలు రెచ్చగొడుతున్నారు : సిద్ధరామయ్య

ముడా మనీ లాండరింగ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీద ఈడీ కేసు నమోదు చేసింది.  ఇప్పటికే దీనికి సబంధించి పోలీస్ కేసు నడుస్తోంది. తాజాగా ఈడీ కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపింది. ఇప్పుడు ఈడీ సిద్ధరామయ్యతో పాటూ ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామిల మీ కూడా ఈడీ కేసు నమోదు అయింది. 

అంతకు ముందు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ముడా స్కామ్ కేసులో ఎదురుదెబ్బ తగిలింది. ముడా స్కామ్‌కు సంబంధించి సిద్ధరామయ్య, ఆయన భార్యతో పాటు ఇతరులపై కూడా విచారణ చేసేందుకు బెంగళూరు ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ విచారణపై మూడు నెలల్లోగా నివేదిక అందించాలని లోకయుక్త పోలీసులను ఆదేశించింది. మైసూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఆథారిటీ (MUDA) కుంభకోణం ప్రస్తుతం కర్ణాటకలో హాట్‌ టాపిక్‌గా మారింది. స్థలాల కేటాయింపులో సీఎం సిద్ధరామయ్య కుటంబ సభ్యులు లాభాలు పొందారని, అలాగే ముఖ్యమంత్రి అధికారాన్ని సైతం దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి. టి.జె అబ్రహం అనే సామాజిక కార్యకర్త ఈ వ్యవహారానికి సంబంధించి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. 

ఈ నేపథ్యంలో మూడా స్కామ్‌పై వస్తున్న ఆరోపణల్లో సిద్ధరామయ్యపై విచారణ జరిపేందుకు కర్ణాటక గవర్నర్‌ ఆమోదం తెలిపారు. దీంతో సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్‌ తనపై విచారణకు పర్మిషన్‌ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్‌ వేశాడు. అయితే దీనిపై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ క్రమంలోనే స్పెషల్‌ కోర్టు ముడా కుంభకోణంలో సిద్ధరామయ్య, తన భార్యతో పాటు ఇతరులపై విచారణ చేయాలని పోలీసులకు ఆదేశించింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు