/rtv/media/media_files/2025/02/28/TLSfRvuqVJ8qHyoS9sMx.jpg)
DK Shiva Kumar
తాను హిందువుగానే పుట్టాను, హిందువుగానే చనిపోతానని అన్నారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. ఇటీవల తమిళనాడులోని ఇషా యోగా కేంద్రంలో జరిగిన మహా శివరాత్రి వేడుకలకు సద్గురు జగ్గీ వాసుదేవ్ తో కలిసి శివకుమార్ హాజరయ్యారు. దీంతో ఆయనపై సొంత పార్టీ నుంచే విమర్శలు మొదలయ్యాయి. కర్ణాటక సహకార మంత్రి కేఎన్ రాజణ్ణ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని విమర్శించిన వారితో శివకుమార్ ఎలా వేదికను పంచుకోగలరని ప్రశ్నించారు.
అయితే ఈ వ్యవహారంపై డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ స్పందించారు. డీకే శివకుమార్ పార్టీకి సమాచారం ఇచ్చిన తర్వాతే తాను అలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటారని స్పష్టం చేశారు. ప్రధాని మోదీని సైతం కలిసినప్పుడు కూడా పార్టీ హైకమాండ్ కు ముందుగానే ఆయన సమాచారం ఇచ్చారన్నారు. అదేవిధంగా ఈశా ఫౌండేషన్ మహాశివరాత్రి కార్యక్రమంలో పాల్గొనే విషయాన్ని కూడా ఆయన పార్టీకి సమాచారం ఇచ్చారని తెలిపారు.
హిందువుగా పుట్టా.. హిందువుగా చనిపోతా
అయితే తన సందర్శనను శివకుమార్ సమర్థించుకున్నారు. నేను హిందువుగా పుట్టాను మరియు హిందువుగానే చనిపోతాను' అని కామెంట్ చేశారు. సద్గురు కర్ణాటకకు చెందినవారని.. ఆయన కావేరీ నీటి కోసం పోరాడుతున్నారని తెలిపారు. ఆయన వచ్చి నన్ను స్వయంగా ఆహ్వానించారని వెల్లడించారు. వివిధ రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు, నాయకులు అక్కడ ఉన్నారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళానని తెలిపారు.
'నా నియోజకవర్గంలో దాదాపు 100 అడుగుల ఎత్తున్న యేసు విగ్రహం ఉంది. స్థానిక నియోజకవర్గ ప్రజలే క్రీస్తును నిర్మించారు. అప్పుడు బీజేపీ వాళ్ళు నన్ను 'యేసుకుమార' అని పిలిచారు... నేను అన్ని మతాలను, అన్ని కులాలను నమ్ముతాను. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం సమాజంలోని ప్రతి ఒక్కరినీ కలిసి ముందుకు తీసుకెళ్లడం, కాబట్టి కొంతమందికి ఇది నచ్చవచ్చు,మరి కొంతమందికి నచ్చకపోవచ్చు అని ఆయన అన్నారు.
Also read : మేడిగడ్డలో లోపాలు.. ఆ బ్లాక్ మళ్లీ నిర్మించాల్సిందే .. ఎన్డీఎస్‌ఏ సంచలన రిపోర్ట్
Also read : పిల్లలమ్మ, పిల్లలూ.. నార్త్ ఇండియన్ పిల్లలు.. ఏపీలో బలగం సరోజిని దందా గుట్టురట్టు