BIG BREAKING : కేంద్రం సంచలనం.. కట్టెల పొయ్యిలకు గ్రీన్ సిగ్నల్!

కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం గతంలో విధించిన కట్టెల పొయ్యిల నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఎత్తివేసింది.

New Update
BREAKING

BREAKING

కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం గతంలో విధించిన కట్టెల పొయ్యిల నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఎత్తివేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీలో నెలకొన్న కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల కొరత వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు మరియు చిన్న చిన్న ఆహార విక్రయశాలలు మూతపడే పరిస్థితి రావడంతో కేంద్రం ఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వలన నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గ్యాస్ సరఫరాకు ఆటంకం కలగడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీలో బొగ్గు, కట్టెల వాడకంపై గ్రాప్ నిబంధనల ప్రకారం కఠినమైన ఆంక్షలు అమలులో ఉండేవి. 

వెసులుబాటు కేవలం తాత్కాలికమే

అయితే ఈ వెసులుబాటు కేవలం తాత్కాలికమేనని, గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి వచ్చే వరకు మాత్రమే ఇది అమల్లో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో గ్యాస్ ఏజెన్సీల ముందు సిలిండర్ల కోసం భారీ క్యూలు కనిపిస్తున్నాయి. బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్ల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో, చిన్న హోటల్ యజమానులకు కట్టెల పొయ్యిలు వాడుకోవడానికి అనుమతి ఇవ్వడం పెద్ద ఊరటనిచ్చే విషయమే. ఈ నిర్ణయంతో కట్టెల ధరలు కూడా ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. 

Advertisment
తాజా కథనాలు