Building Collapse : చూస్తుండగానే కుప్పకూలిన రెండతస్తుల భవనం! ఢిల్లీలో కరోల్‌బాగ్‌లోని ప్రసాద్ నగర్ ఏరియాలో రెండంతస్తుల నివాస భవనంలోని ఓ భాగం బుధవారం ఉదయం కూలింది. దీంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు.ఇప్పటి వరకు 12 మందిని రెస్య్కూ టీమ్స్ రక్షించాయి. By Bhavana 18 Sep 2024 | నవీకరించబడింది పై 18 Sep 2024 13:19 IST in నేషనల్ క్రైం New Update షేర్ చేయండి Delhi: రాజధాని నగరం ఢిల్లీలో ఓ రెండతస్తుల భవనం కుప్పకూలింది. కరోల్‌బాగ్‌లోని ప్రసాద్ నగర్ ఏరియాలో రెండంతస్తుల నివాస భవనంలోని ఓ భాగం బుధవారం ఉదయం కూలింది. దీంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎప్ టీమ్స్ కూడా పాల్గొన్నాయి. అయితే, ఇప్పటి వరకు 12 మందిని రెస్య్కూ టీమ్స్ రక్షించాయి. కాగా, ఇటీవల దేశ రాజధానిలో భారీ వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగానే ఈ బిల్డింగ్ కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. గత నెలలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఢిల్లీలోని మోడల్ టౌన్‌లో భారీ వర్షాల వల్ల పునర్నిర్మాణం కోసం కూల్చివేస్తున్న శిథిలమైన భవనం కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు నిర్థారించారు. Also Read: Jhony Master Arrest: జానీ మాస్టర్ కు పోలీసులు నోటీసులు! #delhi #building-collapse మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి