గుజరాత్‌లో 5వేల కోట్ల డ్రగ్స్ సీజ్

గుజరాత్‌లో అతి పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు పోలీసులు. దాదాపు 518 కిలోల కొకైన్‌ను పట్టుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో 5వేల కోట్లు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. 

New Update
Drugs

 5k Crores Durgs: 

గుజరాత్‌లో మాద ద్రవ్యాల స్మగ్లింగ్ కలకలం రేపుతోంది. ఇక్కడ పెద్ద మొత్తంలో కొకైన్ పట్టుబడడం సంచలనంగా మారింది. ఢిల్లీ, గుజరాత్ పోలీసులు సంయుక్తంగా 518 కిలోల కొకైన్ డ్రగ్స్‌ను సీజ్ చేశారు. దీని విలువ 5 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. గుజరాత్‌లోని  అంక్లేశ్వర్‌లో ఓ కంపెనీలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా..  భారీ స్థాయిలో డ్రగ్స్‌ పట్టుబడినట్లు సమాచారం. రీసెంట్‌గా దేశ రాజధాని దిల్లీలోనూ కేవలం పది రోజుల వ్యవధిలోనే రెండు ఘటనల్లో రూ.వేల కోట్లు విలువ చేసే డ్రగ్స్‌ను సీజ్‌ చేశారు. 

అంక్లేశ్వర్‌‌లో ఓ పార్మాస్యూటికల్ కంపెనీలో డ్రగ్స్ దొరికాయి. అక్టోబర్‌ 1న కూడా ఈ విధంగానే ఢిల్లీ పోలీసులు పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.  ఢిల్లీలోని మహిపాల్‌పుర్‌లోని గోదాంలో సోదాలు జరిపిన స్పెషల్‌ సెల్‌ పోలీసులు .. 562 కేజీల కొకైన్‌, 40కిలోల హైడ్రోపోనిక్‌ మారిజునాను సీజ్‌ చేశారు. ఈ కేసు దర్యాప్తులో వచ్చిన సమాచారం ఆధారంగా అక్టోబర్‌ 10న ఢిల్లీలోని రమేశ్‌ నగర్‌ ప్రాంతంలోని ఓ షాప్‌లో దాడులు చేసి 208కిలోల కొకైన్‌ను సీజ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పుడు మళ్ళీ గుజరాత్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. అంటే కేవలం 15 రోజుల వ్యవధిలో ఢిల్లీ, గుజరాత్‌లలో దాదాపు రూ.13వేల కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ డ్రగ్స్ డీలర్లకు ఒకరితో ఒకరికి సబంధాలున్నాయేమో అన్న కోణంలో విచారిస్తున్నారు. పట్టుబడిన వారందరూ డ్రగ్స్‌ను ఎక్కడ నుంచి తెప్పిస్తున్నారు...దేశంలోకి ఎలా వస్తున్నాయి లాంటి విషయాల మీద ఆరా తీస్తున్నారు. 

Also Read: బాబా సిద్ధిఖీ హత్య కేసులో ట్విస్ట్..మైనర్ అనే అనుమానాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు