Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితం లెఫ్టినెంట్ గవర్నర్ వీగే సక్సేనాను కలిసి ఆయన తన రాజీనామా లేఖను అందించారు. By Manogna alamuru 17 Sep 2024 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Aravind Kejriwal: అన్నట్టుగానే అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసేశారు. ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు లెఫ్టినెంట్ గవర్నర్ వీగే సక్సేనాను కలిసిన కేజ్రీవాల్ ఆయనకు తన రాజీనామా లేఖను సమర్పించారు. గవర్నర్‌ను కలవడానికి వెళ్ళినప్పుడు ఆప్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఆతిశీ, ఇతర మంత్రులను తీసుకెళ్లారు. మరోవైపు ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆతిశీ ఎంపికయ్యారు. ఈ రోజు నిర్వహించిన శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఆమెవైపే మొగ్గు చూపారు. ఆతిశీ మర్లెనా సింగ్ ప్రస్తుతం విద్యాశాఖ, దివ్యాంగుల శాఖకు మంత్రిగా ఉన్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అయిన ఆతిషి.. ఢిల్లీలోని పాఠశాలల విద్యా పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆమె ఎంతో కృషి చేశారు. లిక్కర్ కేసులో మనీశ్ సిసోడియా అరెస్టయిన అనంతరం అతిషి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కేజ్రీవాల్, సిసోడియా జైల్లో ఉన్నప్పుడు.. పార్టీ బాధ్యతలు తీసున్నారు Also Read: Stock Market: ఈరోజు కూడా లాభాల్లోనే స్టాక్ మార్కెట్లు #arvind-kejriwal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి