Gas shortage :  ఇరాన్ యుద్ధంతో భారత్‌లో సంక్షోభం..దేశవ్యాప్తంగా గ్యాస్ కష్టాలు

ఇరాన్, ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధంతో భారత్‌లో సంక్షోభం మొదలైంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కమర్షియల్ గ్యాస్ కష్టాలు స్టార్టయ్యాయి.కమర్షియల్‌ గ్యాస్‌ సరఫరాను పంపిణీ సంస్థలు నిలిపివేయడంతో పలు రాష్ట్రాల్లో గ్యాస్‌ కష్టాలు మొదలయ్యాయి. 

New Update
Gas Cylinder

Gas Cylinder

Gas shortage :  ఇరాన్, ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధంతో భారత్‌లో సంక్షోభం మొదలైంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కమర్షియల్ గ్యాస్ కష్టాలు స్టార్టయ్యాయి.కమర్షియల్‌ గ్యాస్‌ సరఫరాను పంపిణీ సంస్థలు నిలిపివేయడంతో పలు రాష్ట్రాల్లో గ్యాస్‌ కష్టాలు మొదలయ్యాయి.  హైదరాబాద్‌లో గ్యాస్‌ కొరతతో హాస్టల్స్‌ మూతపడుతున్నాయి.-- తిరుపతిలో కమర్షియల్ గ్యాస్‌ కొరత మూలంగా భక్తుల ఇబ్బందులు పడుతున్నారు. కేరళలో రేపో ఎల్లుండో 50% హోటళ్లు మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతుంది.

ఇప్పటికే ముంబైలో 10వేల రెస్టారెంట్లు మూతపడటంతో  4లక్షల మంది రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. ఢిల్లీలో గ్యాస్ ఏజెన్సీల ముందు రీఫిల్లింగ్ కోసం భారీ ఎత్తున క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు. బెంగళూరు హోటళ్ల మెనూలో వంటకాలు తగ్గించారు. తమిళనాడు రెస్టారెంట్లలో ఎలక్ట్రిక్ ఓవెన్లు వినియోగిస్తున్నారు. గుజరాత్‌లో పలు తినుబండారాల దుకాణాలు  మూతపడ్డాయి.

ఒడిశా హోటళ్లలో ఇండక్షన్ స్టౌవ్‌లు వినియోగిస్తూ, అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో డొమెస్టిక్ గ్యాస్ వినియోగదారుల నుంచి అధిక వసూళ్లు చేస్తున్నారు. జార్ఖండ్‌లో కమర్షియల్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ దందా షూరువైంది. పంజాబ్‌లో  పెళ్లిళ్ల మండపాలు, క్యాటరింగ్ సిబ్బంది తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. అస్సాంలో గ్యాస్ ధరల పెరుగుదలపై నిరసనలు మొదలయ్యాయి. బీహార్‌, ఉత్తరాఖండ్‌లో సరఫరా కొరతపై ఆందోళనలు కొనసాగతున్నాయి.

Advertisment
తాజా కథనాలు