మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్..మహా రిజల్ట్‌పై ఉత్కంఠత

మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. మరి కొద్ది సేపట్లో అన్ని లెక్కలూ తేలిపోనున్నాయి. రేపు ఉదయం 8.30 నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. మహా రిజల్ట్‌పై అభ్యర్థులతో పాటూ ప్రజలు కూడా తీవ్ర ఉత్కంఠంగా ఉన్నారు. 

By Manogna alamuru & Editor 1
New Update

 Maharshtra, Jharkhand Counting:  

నేడే ఎన్నికల కౌంటింగ్. అంటే మరి కొద్ది సేపట్లో ఓట్ల లెక్కింపు స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే మహారాష్ట్ర, జార్ఖండ్‌లో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను చేసేశారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఉదయం 8.30 నుంచి ఈవీఎంల ఓట్లను అధికారులు లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలు, జార్ఖండ్‎లోని 81 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 15 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించింది ఈసీ. ఇదే రోజు వాయనాడ్‌లో కూడా ఉప ఎన్నిక ఫలితాలు విడుదల అవనున్నాయి. ఇక్కడ కూడా ఎవరు గెలుస్తారనే దానిపై అందరూ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. 

 ఇండియాలో ఉత్తరప్రదేశ్ తర్వాత పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. రాజకీయాల పరంగా కూడా ఇది ముఖ్యమైన రాష్ట్రం. ఇక్కడ గెలుపోటములు ప్రముఖ పార్టీలన్నింటికీ చాలా అవసరం. ఈసారి ఎన్నికల్లో మహాయుతిని గెలిపించి మళ్ళీ అధికారంలోకి రావాలని బీజేపీ, రెండవ పెద్ద రాష్ట్రంలో పట్టు సాధించాలని ఇండియా కూటమి చాలా గట్టిగా ప్రయత్నించాయి.  ఇక మహారాష్ట్ర‎‎లో గెలుపుపై ఎన్డీఏ, ఇండియా కూటములు రెండూ ధీమాతో ఉన్నాయి. ఇక్కడ ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా కుల గణన, రిజర్వేషన్లు, రైతుల పంటలకు మద్దతు ధర, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు నిలువగా.. జార్ఖండ్ ఎన్నికల్లో అక్రమ చొరబాట్లు, రిజర్వేషన్లు, జేఎంఎం అవినీతి, రైతుల పంటలకు మద్దతు ధరలు, ఉద్యోగాలు, సంక్షేమ పథకాల వంటివి  ప్రధాన అంశాలుగా నిలిచాయి. మహారాష్ట్రలో 145 మేజిక్ ఫిగ్‌ను సాధించి మళ్ళీ తామే అధికారంలోకి వస్తామని మహాయుతి, బీజేపీ నమ్మకంగా చెబుతున్నాయి.

అయితే మహారాష్ట్రలో దాదాపు పెద్ద సర్వే సంసంథలు అన్నీ ఎగ్జిట్ పోల్స్ను ఇవ్వలేదు. ముఖ్యంగా మై యాక్సిస్ ఇండియా సర్వే అస్సలు దాని ఊసే ఎత్తలేదు. జార్ఖండ్‌లో రిలీజ్ చేసినా ఏదో తమ ట్విట్టర్, వెబ్ సైట్లలలో నిలీజ్ చేసుకుందే తప్ప. ఎక్కడా, ఏ టీవీ ఛానెల్ లేదా వార్తా సంస్థలకు తమ ఎన్నికల ఫలితాల అంచనాలను ఇవ్వలేదు. లోక్ శాహీ మరాఠీ, చాణక్య, సీఎన్ఎన్ న్యూస్ –18 లాంటివి మాత్రమే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్‌ను రిలీజ్ చేశాయి. మహారాష్ట్రాలో కొద్దో గొప్పో చెప్పుకోవాల్సి వస్తే పీపుల్ పల్స్ ఒకటే పెద్దదిగా చెప్పుకోవాలి. అవతల జార్ఖండ్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. దీంతో ఇప్పుడు ఫైనల్ ఫలితాల మీద అభ్యర్థులతో పాటూ ఓటర్లు కూడా చాలా ఉత్కంఠంగా ఉన్నారు.  

Also Read: Ukraine: థర్డ్ వరల్డ్‌ వార్ మొదలైంది‌‌‌‌–ఉక్రెయిన్ మాజీ జనరల్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

viral News: పోషించలేనప్పుడు పెళ్లేందుకు చేసుకుంటున్నారు..!

పోషించలేనప్పుడు పెళ్లేందుకు చేసుకున్నారు అనే ఓ న్యాయమూర్తి ప్రశ్న ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఓ న్యాయవాదిని ఆయన మీకు పోషించే స్థాయి లేనప్పుడు వివాహం ఎందుకు చేసుకున్నారని ఆయన ప్రశ్నించడం పలు విమర్శలకు దారి తీసింది.

New Update
lawyer

lawyer

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి లైఫ్‌ లో చాలా ముఖ్యమైన ఘట్టం. పెళ్లి చేసేటప్పుడు పెద్దలు ఇరుకుటుంబాల ఆరోగ్య,ఆర్థిక, ఆస్తి, స్థితిగతులను తెలుసుకుని వివాహలు చేస్తుంటారు. అయితే ఇటీవలే కోర్టులో  ఓ న్యాయవాదికి, న్యాయమూర్తికి మధ్యన జరిగిన వాదన ఆడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Also Read: Trump: ట్రంప్ నిర్ణయాలు.. భారత విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం..!

ఆ  వీడియోలో.... వారిద్దరి సంభాషణ ఇలా సాగింది...
న్యాయమూర్తి: “మీకు ఉద్యోగం లేదా?”
వ్యక్తి: “లేదు సార్. నన్ను పిలిచినప్పుడల్లా నేను వెళ్లి డాక్టర్ సర్వీస్ ఇస్తానని చెప్పాను. 
న్యాయమూర్తి: “వారు ముందస్తు అనుమతి తీసుకున్నప్పుడు, అది పూర్తిగా తప్పు. మీ ఆదాయం గురించి మీరు ఏం తెలియజేశారు.


వ్యక్తి: “సార్, నాకు ఇప్పుడు ఉద్యోగం లేదని నేను చెప్పాను. నన్ను పిలిచినప్పుడు, నాకు ఉద్యోగం ఉందని రాశాను.”
న్యాయమూర్తి: “మీరు డాక్టర్. ఆదాయం లేకుండా వివాహం చేసుకునే హక్కు న్యాయవాదికి మాత్రమే ఉంది. వైద్యుడికి ఎటువంటి హక్కు లేదు. మీకు ఆదాయం లేకపోతే, మీరు ఎందుకు వివాహం చేసుకున్నారు?”

Also Read: హెల్త్‌ సూపర్‌వైజర్‌ హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్.. సుపారీ ఇచ్చి మరీ భార్య దారుణంగా!

ఈ వాదన మధ్యప్రదేశ్ కి చెందిన ప్రముఖ న్యాయమూర్తి వివేక్ అగర్వాల్ కి ఓ డాక్టర్ కి మధ్యన జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో సంపాదన లేనప్పుడు వెళ్లేందుకు చేసుకున్నారని వివేక్ అగర్వాల్ అడిగిన ప్రశ్న హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో పై కొందరు నెటిజన్లు స్పందిస్తూ పెళ్లి చేసుకోవాలంటే కచ్చితంగా సంపాదన ఉండాలని రాజ్యంగంలో రాసి ఉందా అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఆస్తులు, అంతస్తులు, సంపాదన వంటివి చూసి పెళ్లి చేసుకుంటే అందులో వ్యాపారం తప్ప.. ప్రేమ ఎక్కడుంటుందని అంటున్నారు మరికొందరు.

ఇంకొందరు మాత్రం మగాడు సంపాదిస్తినే పెళ్ళికి అర్హుడా..? ఒకవేళ పెళ్ళికి ముందు మంచి ఉద్యోగం లక్షల్లో జీతం ఉండి.. పెళ్లి తర్వాత ఏదైనా కారణాలవల్ల ఉద్యోగం కోల్పోతే విడాకులు ఇచ్చేస్తారా.. అంటూ మండిపడుతున్నారు. ఈ వాదనలో న్యాయమూర్తి ఎందుకు అలాంటి ప్రశ్నలు అడగాల్సి వచ్చిందనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు.

Also Read: BIG BREAKING: ఏపీ సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం.. పవన్ పేషీలో మంటలు!

Also Read: Yuzvendra Chahal - RJ Mahvash: ఆమెకు మనసిచ్చేసిన చాహల్.. ఒక్క లైక్‌తో దొరికేసాడుగా!

madhyapradesh | video | audio record | viral | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment