కార్పొరేట్ హత్యలు.. పని చేస్తున్నామా..చావుకు దారులు వేసుకుంటున్నామా?

ఎర్నెస్ట్ అండ్ యంగ్ లో పనిచేస్తూ చనిపోయిన అన్నా మరణం ఇప్పుడు కార్పొరేట్ హత్యల మీద చర్చకు దారి తీస్తోంది. ఉద్యోగులు పని చేస్తున్నారా లేదా తమ చావుకు తామే దారులు వేసుకుటున్నారా అనే సందేహాలు వెలువడుతున్నాయి. ఏ వెలుగుల కోసం ఇదంతా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.

author-image
By Manogna alamuru
New Update
work

Targets + torture = Work Culture

ఒక శతాబ్దం క్రితం రోజుకు 14-16 గంటలు పని చేసే విధానం ఉంది. పెట్టుబడిదారుల ధన దాహానికి ఎంతో మంది కార్మికులు అసువులు  బాసారు. వెట్టి చాకిరీ విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు చేసిన ఎన్నో ఉద్యమాల కారణంగా రోజుకు 8 గంటలు పని విధానం అమల్లోకి వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ పరిస్థతి వెనక్కు వెళ్ళింది. పేరుకు ఎనిమిది గంటల జాబే కానీ ఏ కార్పొరేట్ ఉద్యోగీ కనీసం 12 గంటలకు తక్కు పని చేడం లేదు ఈరోజుల్లో.  విడ్డూరం ఏంటంటే కమ్యూనిస్ట్ దేశంగా చెప్పుకునే చైనాలోను ప్రస్తుతం ఈ విధానం అమల్లో లేదు. అటు కాపిటలిస్ట్ దేశం అమెరికాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వర్క్ ప్రెజర్ కారణంగా అమెరికాలో అనారోగ్యానికి గురవుతున్న బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. ఇక ఇండియాలో అయితే జనాలు చచ్చిపోతున్నారు. ఇలా ఇండియా లోనే కార్పొరేట్ సంస్థలే కాకుండా దాదాపు ప్రపంచమంతా అనధికారిక వెట్టిచాకిరి విధానాలు కనిపిస్తున్నాయి. 

టార్గెట్+టార్చర్= వర్క్ కల్చర్ ఇదీ ఇప్పుడు పరిస్థితి. చిన్న చిన్న కంపెనీల దగ్గర నుంచీ బడా సంస్థ వరకూ ఇదే సిచ్యువేషన్. ఆఫీస్ టైమ్ అయి ఇంటికి వచ్చాక కూడా డబ్బా ముందేసుకుని పని చేస్తున్నారు ఉద్యోగులు. ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారు, ఎప్పుడు నిద్ర పోతున్నారో కూడా చూసుకోవడం లేదు. అసలు తాము మనుషులమా...లేక గాడిదలమా అన్న విషయం కూడా మర్చిపోతున్నారు. దీనికి కారణం కంపెనీలు పెట్టే టార్గెట్లు. దేశాభివృద్ధి కోసం అని చెప్పి తమ స్వంత లాభాలను మూటగట్టుకుంటున్నాయి కార్పొరేట్ కంపెనీలు. ఉద్యోగులు పని చేస్తే కానీ ముందుకు కదలని ఈ సంస్థలు సంపాదించే లాభాలు చాలా ఎక్కువ. దాని కోసం ఉద్యోగులకిచ్చేది పిసరంత. దానికి తోడు శారీరక, మానసిక సమస్యలు...కొంతమందికి చావు కూడా. 

ఎర్నెస్ట్ అండ్ యంగ్ లో సీఏగా పనిచేసిన 26 ఏళ్ల ఉద్యోగి అన్నా సెబాస్టియన్ పెరాయిల్ మరణం ఇప్పుడు కార్పొరేట్ రంగంలో పని గంటలు, ఒత్తిడిని హైలెట్ చేస్తోంది. కార్పొరేట్ రంగంలో వర్క్ కల్చర్ మీద ప్రశ్నలు లేవనెత్తుతోంది. అన్నా తల్లి తన కూతురు ఒత్తిడి, పనిభారంలో మరణించారని ఆరోపించారు. అయితే, తన కూతురు అంత్యక్రియలకు ఒక్క సహోద్యోగి కూడా రాలేదని ఆమె చెబుతున్నారు. అంటే మనుషులు ఉద్యోగాలు, టార్గెట్ల గోలలో పడి మనుషులుగా కూడా బతకడం మానేస్తున్నారు. బాధితులకు సపోర్ట్ చేస్తే ఎక్కడ తమ ఉద్యోగం పోతుందో అని భయం. అనునిత్యం ఈరోజు పని చేయకపోతే రేపెమవుతుందో అనే భయంతో బతుకుతున్నారు. పక్క వారి బాధలను చూడ్డం మాట అటుంచి...ఒకరితో ఒకరు హాయిగా మాట్లాడుకోలేని పరిస్థితుల్లోకి కూడా వెళ్ళిపోతున్నారు. పోనీ ఇంట్లో వారితో అయినా టైమ్ స్పెండ్ చేస్తున్నారా అంటే...అదీ లేదు. రోజుకు 15, 20 గంటలు పని చేస్తుంటే ఇంక ఇంట్లో వాళ్ళతో ఏం గడుపుతారు. పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లలని కంటారు..వాళ్ళకి అన్నీ చేస్తారు కానీ టైమ్ మాత్రం ఇవ్వరు...ఇదీ ఇప్పుడు చాలా మంది కార్పొరేట్ ఉద్యోగుల ఇంట్లో పరిస్థితి. ఇలా కొంత వరకు బాగానే ఉంటుంది. కానీ నెమ్మదిగా ఉద్యోగులను అన్ని రకాల రోగాలు చుట్టుముడుతున్నాయి. స్ట్రెస్, డిప్రెషన్ వస్తున్నాయి. ఉద్యోగులు రియలైజ్ అయ్యే లోపు చనిపోతున్నారు. తరచి చూస్తే ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. అన్నా సెబాస్టియన్‌లా మనం లేము. ఆఅమ్మాయి మరీ సెన్సిటివ్ అని ఎవరైనా అనుకుంటున్నారు అంటే వాళ్ళు వాస్తవాన్ని గుర్తించడం లేదని అర్ధం.

ఎందుకంటే కార్పొరేట్ సంస్థల వల్ల ఒక్క అన్నా సెబాస్టియన్ మాత్రమే బాధలు పడడం లేదు. ఆ  అమ్మాయి చనిపోయింది కాబట్టి ఆ విషయం బయటకు వచ్చింది. కానీ అనేక సమస్యలో బాధలు పడుతున్నవారు ఎంతోమంది ఉన్నారు. అన్నా విషయం వెలుగులోకి వచ్చాక చాలా మంది కార్పొరేట్ ఉద్యోగులు తమ బాధలు చెప్పుకుంటున్నారు. ఇందులో సీఏలు, సాఫ్ట్‌వేర్‌‌ రంగం వారు, మీడియా ఇలా చాలా మంది ఉన్నారు. నిజానికి ప్రతీ కార్పొరేట్ కంపెనీలో కూడా వర్క్ కల్చర్ దారుణంగానే ఉంటోంది. అంతర్జాతీయంగా పెద్ద కంపెనీలు అయిన డెలాయిట్, టీసీఎస్ ఉద్యోగులు షేర్ చేసిన కింది అనుభవాలను చూస్తే మీకే అర్ధం అవుతుంది పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. జీవితంలో వర్క్ ఒక్కటే కాదు..ఇంకా చాలా ఉన్నాయి అని.

 

 

 

 

ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి లాంటి వాళ్ళు వారానికి 70 గంటలు పని చేయాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు. అది కూడా దేశం కోసం అంట. వాళ్ళకేమి చెప్పడానికి ఎన్నైనా చెబుతారు. ఒడ్డు కూర్చున్న వారికి ఏం తెలుస్తుంది మునిగిపోతున్నవారి బాధలు. నారాయణ మూర్తి చిన్నగా ఉన్నప్పుడు చాలానే కష్టపడి పని చేశారు. ఇది ఎవరూ కాదనలేరు. ఆయన వారానికి 70 గంటలే పని కూడా చేసి ఉండవచ్చు. కానీ అప్పటికి, ఇప్పటికి పరిస్థితులు మారాయి. టార్గెట్లు మారాయి. మనుషుల శరీర స్థితిగతులు మారాయి. అవన్నీ కూడా చూసుకోవాలి. అసలు ఇదంతా కాదు ప్రొడక్టివిటీ ముఖ్యమా పని చేసే గంటలు ముఖ్యమా అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న. రోజుకి 8 గంటల పని విధానం అమలులో ఉన్నప్పుడు వారానికి 40 లేదా 48 గంటలు పని ఉండాలి. మరి 70 గంటలు పని చేయడమేంటో చెప్పే వారికే తెలియాలి. వారు చేసారు కదాని అదే విధానాన్ని అందరి మీద రుద్దడం ఎంతవరకు న్యాయమో ఆలోచించుకోవాలి. 

Also Read: Andhra Pradesh: దేశ అభివృద్ధిలో యువత కీలకం-ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి

Advertisment
Advertisment
తాజా కథనాలు