/rtv/media/media_files/2025/03/24/Fq5IvbqgDDBG3pPR9cci.jpeg)
Parliament
central on de limitation : దేశంలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగబోతున్నాయి.పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దామాషా లెక్కన 28 రాష్ట్రాల్లో 50 శాతం పెంచాలని నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం ఎంపీ స్థానాలు 543నుంచి 816కి చేరుకోనున్నాయి. 4,123 అసెంబ్లీ స్థానాలు కూడా 6,185కు పెరుగుతాయి.పెరిగిన స్థానాలకు లోబడే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. అలాగే 33 శాతం మహిళా రిజర్వేషన్ వర్తింపజేస్తారు. రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెంచుతారు.వీటన్నింటికీ 2011 జనాభా లెక్కలనే తీసుకుంటున్నారు. సో, ఇవన్నీ పూర్తయ్యాకే 2029లో ఎన్నికలకు వెళ్లడానికి కేంద్రం డిసైడ్ అయింది.ఈ మేరకు ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు తీసుకురావడానికి కేంద్రం చర్చలు మొదలుపెట్టింది.అవసరమైతే బడ్జెట్ సమావేశాలను పొడిగించే యోచనలో ఉంది.
తెలంగాణలో ప్రస్తుతం 17 లోక్‌సభ స్థానాలు, 119 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి.కేంద్రం తాజా నిర్ణయంలో తెలంగాణలోనూ 50 శాతం సీట్లు పెరుగుతాయి...తెలంగాణలో లోక్‌సభ సీట్లు 17 నుంచి 26కి, అసెంబ్లీ సీట్లు 119 నుంచి 179కు చేరుతాయి. ఇక పొరుగు తెలుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 175 అసెంబ్లీ స్థానాలుంటే, భవిష్యత్తులో ఆ సంఖ్య 263కు చేరుకుంటుంది.ఇక ఏపీ లోక్‌సభ స్థానాలు 25నుంచి 38కి పెరిగే ఛాన్స్ ఉంది.
అయితే కేంద్రం నిర్ణయానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి నిరసన సెగ తగులుతోంది...ఎందుకంటారా...?వాస్తవానికి ప్రతి పదేళ్లకు జనగణనను కేంద్రం నిర్వహిస్తుంది...అయితే కరోనాతో 2021లో జనగణన వాయిదా పడింది.దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ తొలి విడత.2027 ఫిబ్రవరిలో రెండో విడత జనగణన నిర్వహించడానికి కేంద్రం ఇప్పటికే ప్రణాళిక రచించబోతుంది.అయితే, ఈ లెక్కలన్నీ ఓ కొలిక్కి రావాలంటే చాలా సమయం పడుతుంది.
దీంతో 2011 జనాభా లెక్కలతో నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం శ్రీకారం చుట్టింది..కానీ, జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడితే...జనాభా నియంత్రణ పాటించిన తాము తీవ్రంగా నష్టపోతామని. అలాగే నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ర్టాలు లబ్ధి పొందే అవకాశం ఉంటుందని దక్షిణాది రాష్ర్టాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.వారి నిరసన ఈనాటిది కాదు చాన్నాళ్ల నుంచి కొనసాగుతోంది.2011 జనాభా లెక్కల ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన అని కేంద్రం పైకి చెప్తున్నప్పటికీ..జనాభాతో సంబంధం లేకుండా అన్ని రాష్ర్టాల్లో సగటున లోక్‌సభ, అసెంబ్లీ సీట్లు 50 శాతం పెంపునకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. దీంతో అన్ని రాష్ర్టాలకు గంపగుత్తగా 50 శాతం సీట్లు పెరిగే ఛాన్స్ ఉంది...తద్వారా లోక్‌సభలో ఇప్పుడున్న అన్ని రాష్ట్రాల ప్రాతినిధ్య శాతం యథాతథంగా కొనసాగనుంది.
ఇక ఎస్సీ, ఎస్టీల రిజ్వర్ స్థానాల విషయానికి వస్తే ప్రస్తుతం ఎస్సీ రిజర్వ్‌డ్ లోక్‌సభ స్థానాలు 84 ఉన్నాయి. దీనికి అదనంగా 42 స్థానాలు చేరి 126కు పెరగబోతున్నాయి. ఎస్టీ రిజర్వ్‌డ్ లోక్‌సభ స్థానాలు 47 ఉన్నాయి.అదనంగా 27 స్థానాలు పెరిగి ఆ సంఖ్య 71కు చేరుకోబోతుంది.అలాగే ఇప్పటికే ఆమోదించిన బిల్లు ప్రకారం 2034 నుంచి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమల్లోకి రావాలి.కానీ ఆలస్యం జరగకుండా పనిలో పనిగా 2011 జనాభా లెక్కల ఆధారంగానే మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలుచేసేలా కేంద్రం యోచిస్తోంది.2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేపట్టాలన్నా.33 శాతం మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తీసుకురావాలన్నా చట్ట సవరణలు జరగాల్సందే.అలా జరగాలంటే పార్లమెంట్ ఉభయసభల్లో హాజరైన సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది ఆమోదం లభించాలి..లోక్‌సభలో 240 మంది ఎంపీలు, రాజ్యసభలో 103 మంది ఎంపీల బలం ఉన్న బీజేపీకి విపక్షాల మద్దతు లేకుండా చట్ట సవరణలు సాధ్యపడవు.
Follow Us