Haryana: హర్యానాలో బీజేపీకి ఝలక్..కాంగ్రెస్ వైపు మొగ్గు

హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం కష్టమే అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. ఇక్కడ కాంగ్రెస్ విజయం గ్యారంటీ అని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మొత్తం 90 స్థానాల్లో 55కు పైగా కాంగ్రెస్ చేజిక్కించుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. 

author-image
By Manogna alamuru
New Update
exit

Haryana Exit Polls results: 

హర్యానాలో కాంగ్రెస్‌కు తిరుగులేదు అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్ సర్వేలు. అలా అయితే ముఖ్యమంత్రి ఎవరు అన్నది కూడా చర్చిస్తున్నారు. ప్రధానంగా పార్టీ సీనియర్‌ నేతలు కుమారి సెల్జా, రణ్‌దీప్‌ సూర్జేవాలా పేర్లు వినిపిస్తున్నాయి. దీనిపై ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపీందర్‌ సింగ్‌ హుడా కూడా స్పందిచారు. కనీసం 55 స్థానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.  రాష్ట్ర పార్టీ నేతలు కూడా ఇదే ఆశిస్తున్నారు. హర్యానాలో ప్రజలు బీజేపీ పాలనతో విసిగపోయారని...అందుకే ఈసారి మార్పును కోరుకుంటున్నారని అంటున్నారు. దాంతో పాటూ ఇక్కడి కులసమీకరణాలు కూడా ఆ పార్టీని దెబ్బ తీసే అవకాశం ఉందని అంటున్నారు. 

ఇవాళ ఒకే విడతలో హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ.. మాజీ సీఎం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడా, మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా సహా కీలక నేతలు బరిలో ఉన్నారు. వీరితోపాటు గత నెలలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న మాజీ రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై ప్రస్తుతం అందరి దృష్టి పడింది.

రిపబ్లిక్‌ మ్యాట్రిజ్‌ సర్వే ప్రకారం
కాంగ్రెస్‌: 55-62
బీజేపీ– 18-24
ఐఎన్‌ఎలడీ+బీఎస్పీ: 3-6
జేజేపీ: 0-3, ఇతరులు: 2-5

పీపుల్స్ ఫ్లస్..హర్యానా

కాంగ్రెస్–49–61
బీజేపీ–20‌‌–2
జేజేపీ– 0–1
ఐఎన్‌ఎలడీ+బీఎస్పీ: 2–3
ఆప్: 0

దైనిక్ భాస్కర్..హర్యానా

కాంగ్రెస్‌: 44–54
బీజేపీ : 15–29
ఐఎన్‌ఎలడీ+బీఎస్పీ: 1–5
జేజేపీ: 0-1, ఇతరులు: 0–1

Also Read: J&K: జమ్మూ–కాశ్మీర్ లో మళ్ళీ హంగేనా?

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు