/rtv/media/media_files/2026/05/01/gas-prices-commercial-cylinder-2026-05-01-16-48-46.jpg)
Gas Prices: Commercial Cylinder
ప్రతి నెల మాదిరిగానే ఈ నెలలో కూడా గ్యాస్ సిలిండర్ ధరలలో మార్పులు జరిగాయి. దేశ చరిత్రలో తొలిసారి గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశాన్నంటాయి. పది కాదు ఇరవై కాదు ఏకంగా రూ.993లు పెరిగి గ్యాస్ సిలిండర్ ధర సంచలనం సృష్టించింది. అయితే ఇది కేవలం వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ పై పెరగడంతో సామాన్య ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ భారీ పెంపు హోటల్, హాస్టల్, రెస్టారెంట్స్ వంటి ఇతర వాటిపై పడనుంది.
19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌పై ఏకంగా రూ.993 పెరగడంతో సిలిండర్ ధర రికార్డు స్థాయికి చేరింది. దీంతో హైదరాబాద్‌లో గతంలో రూ.2,321గా ఉండే కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.3,315కి చేరుకోవడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. అయితే ఈ పెంపు నేరుగా సామాన్యులపైనే పడనుంది.
ఈ భారీ పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్ల ‘మెనూ’లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే నిత్యావసరాల ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనాలకి ఇప్పుడు బయట భోజనం చేయడం కూడా భారంగా మారబోతుంది. ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే హోటల్, హాస్టళ్లలో మెనూ, దాని ధరలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం.
హోటల్స్
ఈ కమర్షియల్ సిలిండర్ల ధరల పెంపుతో హోటళ్లలో టిఫిన్స్.. ఇడ్లీ, వడ, దోశ, పూరి వంటి పదార్థాల ధరలు పెరగనున్నాయి. ప్రస్తుతం ఒక్కో ప్లేటు రూ.30 నుంచి రూ.45 మధ్య ఉండగా.. ఇప్పుడు ప్లేటుపై అదనంగా రూ.5 నుండి 15 వరకు వసూలు చేసే అవకాశం ఉంది.
బిర్యానీ, థాలీ, స్టాటర్స్ ఇలా చాలా పదార్థాల ధరలు 15% నుండి 20% పెరగవచ్చు.
కాఫీ/టీ: ఇప్పటికే డిమాండ్ ఉన్న చాలా షాపులలో ఒక కప్పు టీ/కాఫీ రూ.10 నుండి రూ.25 వరకు ఉంది. ఇక ఇప్పుడు అదనంగా మరో రూ. 5 వరకు పెంచే ఛాన్స్ కనిపిస్తోంది.
హాస్టల్‌లో ‘మెనూ’ లేదా ‘రెంట్’ భారం
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల పెంపుతో హాస్టల్‌లో ఉండే వారికి గట్టి దెబ్బ అనే చెప్పాలి. పెరిగిన గ్యాస్ ఖర్చులను లెవెల్ చేసేందుకు హాస్టల్ యజమానులు రూ.500 నుండి రూ.1000 వరకు రెంట్‌లు పెంచే ఛాన్స్ కనిపిస్తోంది. మరికొన్ని చోట్ల మెనూను తగ్గించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. క్వాంటిటిని తగ్గించడం చేయవచ్చు. లేదా పూరి, ఇడ్లీ, వడ, దోశ వంటి పదార్థాలు చేయకుండా త్వరగా రెడీ అయ్యే ఫుడ్స్ ప్రిపేర్ చేయవచ్చు.
అసలైన కారణం ఇదే..?
ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య యుద్ధం నేపథ్యంలోనే ఈ ధరలు ఆకాశాన్నంటాయని పలువురు మాట్లాడుకుంటున్నారు. క్రూడ్ ఆయిల్ సరఫరాలో ఆటంకాలే వీటికి ముఖ్య కారణమని అంటున్నారు.
Follow Us