/rtv/media/media_files/2026/05/11/udaynidhi-2026-05-11-15-46-46.jpg)
తమిళనాడులో అత్యంత ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్, సోమవారం సాయంత్రం డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నివాసానికి వెళ్లడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పరస్పర వైరుధ్యాలు పక్కన పెట్టి, ఇద్దరు అగ్ర నేతలు కలిసిన తీరు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
Well-begun. @CMOTamilnadu#Vijay called on his predecessor @mkstalin who welcomed him warmly with a hug. So did LoP #Udhayanidhistalin. The courtesy call happened at Stalin's residence. pic.twitter.com/w46uOJ4oxb
— Uma Sudhir (@umasudhir) May 11, 2026
ముఖ్యమంత్రి విజయ్ నేరుగా స్టాలిన్ నివాసానికి చేరుకోగానే, స్టాలిన్ స్వయంగా బయటకు వచ్చి ఆయనకు స్వాగతం పలికారు. సీఎం విజయ్ స్టాలిన్‌ను శాలువాతో సత్కరించారు. దీనికి ప్రతిగా స్టాలిన్ కూడా విజయ్‌ను ఆత్మీయంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం సుమారు గంటకు పైగా సాగిన ఈ భేటీలో ప్రస్తుత తమిళనాడు రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించినట్లు సమాచారం.
శత్రువుల్లా కాకుండా
ముఖ్యంగా కేంద్రంతో రాష్ట్ర సంబంధాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. రాజకీయ విశ్లేషకులు ఈ భేటీని ఒక మంచి పరిణామంగా అభివర్ణిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష నేతలు శత్రువుల్లా కాకుండా, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇలా కలిసి చర్చించుకోవడం ప్రజాస్వామ్యానికి శుభసూచకమని అభిప్రాయపడుతున్నారు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న స్టాలిన్ సలహాలు, నూతన ముఖ్యమంత్రిగా విజయ్ ఉన్న ఉత్సాహం తోడైతే తమిళనాడుకు మేలు జరుగుతుందని సామాన్యులు భావిస్తున్నారు.
Follow Us