చెన్నైలో విషాదం.. తొక్కిసలాటలో 100 మంది పైగా.. చెన్నై మెరీనా బీచ్‌లో దారుణం జరిగింది. భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ప్రారంభించిన ‘మెగా ఎయిర్ షో’లో విషాదం చోటుచేసుకుంది. ఈ షోను వీక్షించేందుకు లక్షలాదిమంది తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. నలుగురు మృతి చెందగా 100 మందికిపైగా గాయపడ్డారు. By srinivas 06 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Chennai Air Show:తమిళనాడులోని చెన్నై మెరీనా బీచ్‌లో దారుణం జరిగింది. భారత వైమానిక దళం (IAF) ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించిన ‘మెగా ఎయిర్ షో’లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈ షోను వీక్షించేందుకు లక్షలాదిమంది తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా 100 మందికిపైగా గాయపడ్డారు. గాలి ఆడక 230 మంది సొమ్మసిల్లి పడిపోయారు. క్షతగాత్రులను అంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రులకు తరలించారు. #Chennai: Massive crowd at Velachery MRTS railway station to catch a train to reach Marina to watch the Indian Air Force’s Air showCommuters said they expected S Rly to operate more trains There was heavy traffic on Velachery Tambaram main road too🎥 from Whatsapp pic.twitter.com/1VTTZBccTj — Srikkanth (@Srikkanth_07) October 6, 2024 అలాగే మెరీనా బీచ్ సమీపంలోని లైట్‌హౌస్ మెట్రో స్టేషన్, వెళచ్చేరి ఎంఆర్టీఎస్ రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోయాయి. వేలాది మంది ఒక్కసారిగా స్టేషన్లకు చేరుకోవడంతో ప్లాట్‌ఫాంల్లో నిలబడేందుకు స్థలం లేకుండా పోయింది. More people gathered here no cop to navigate the public!!No water and Bio toilets were arranged The government should arrange enough train and bus transport to relocate people from destination to parking .#Chennai#AirShow2024 pic.twitter.com/rrNU1GgOvG — ல.மோ. ஜெய்கணேஷ் (@jai_lm) October 6, 2024 ఇక ఈ ఎయిర్ షోకు దాదాపు 10 లక్షలమంది హాజరైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో లు వైరల్ అవుతున్నాయి. Recorded from my apartment, valasaravakkam#airshow #Chennai #AirShow2024 🔥🔥🔥😍 pic.twitter.com/37xh14nzlV — SureshEAV (@Dir_Suresheav) October 6, 2024 #chennai మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి