ఉగ్రవాదానికి ప్రహార్‌తో చెక్.. కేంద్రం సరికొత్త ఎత్తుగడ

ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు కేంద్రం శక్తివంతమైన ‘ప్రహార్’ అనే కొత్త జాతీయ ఉగ్రవాద నిరోధక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఉగ్రవాదానికి మతం, కులం లేదా ప్రాంతం అనే తేడాలు లేవని స్పష్టం చేస్తూ.. హింసను ఏ రూపంలోనూ సహించబోమని కేంద్రం ప్రకటించింది.

New Update
Terrorist

దేశంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం శక్తివంతమైన ‘ప్రహార్’ అనే కొత్త జాతీయ ఉగ్రవాద నిరోధక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఉగ్రవాదానికి మతం, కులం లేదా ప్రాంతం అనే తేడాలు లేవని స్పష్టం చేస్తూ.. హింసను ఏ రూపంలోనూ సహించబోమని కేంద్రం ప్రకటించింది.

‘ప్రహార్’ ముఖ్య ఉద్దేశాలు

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ విధానం కేవలం దాడులు జరిగినప్పుడు స్పందించడమే కాకుండా, దాడులు జరగకుండా ముందే అడ్డుకోవడంపై దృష్టి పెడుతుంది. దీని ప్రధాన లక్ష్యాలు..

ముందస్తు నివారణ: ఉగ్ర దాడులు జరగకముందే వాటిని గుర్తించి అడ్డుకోవడం.
సమన్వయం: కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల మధ్య ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకుంటూ కలిసి పనిచేయడం.
టెక్నాలజీ: ప్రస్తుత కాలంలో ఉగ్రవాదులు వాడుతున్న డ్రోన్లు, డిజిటల్ సాధనాలు వంటి హైటెక్ ముప్పులను దీటుగా ఎదుర్కోవడం.
అంతర్జాతీయ సహకారం: ప్రపంచ దేశాలతో కలిసి ఉగ్రవాద నెట్‌వర్క్‌లను ఛిన్నభిన్నం చేయడం.
చట్టబద్ధత: కఠినమైన చట్టాలను అమలు చేస్తూనే, మానవ హక్కులను కాపాడడం.

‘ఆపరేషన్ కగార్’తో మావోయిస్టుల ఏరివేత

మరోవైపు, దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆపరేషన్ కగార్‌ను వేగవంతం చేసింది. దీనికి మార్చి 31ని డెడ్‌లైన్‌గా నిర్ణయించింది. ఈ గడువులోగా మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో భద్రతా బలగాల ఆపరేషన్లను ముమ్మరం చేసి, వారి ఉనికిని పూర్తిగా తుడిచిపెట్టాలని కేంద్రం పట్టుదలతో ఉంది. మొత్తంగా, అటు అంతర్జాతీయ ఉగ్రవాదంపై ‘ప్రహార్’తో, ఇటు అంతర్గత మావోయిస్టు ముప్పుపై ‘ఆపరేషన్ కగార్’తో కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది.

Advertisment
తాజా కథనాలు