Twisha Sharma Death Case: ట్విషా శర్మ మృతి.. రిటైర్డ్ మహిళా జడ్జి అరెస్ట్!

భోపాల్‌లో సంచలనం సృష్టించిన ట్విషా శర్మ మృతి కేసులో ఒక పెద్ద మలుపు చోటుచేసుకుంది. రిటైర్డ్ మహిళా జడ్జి గిరిబాల సింగ్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. భోపాల్‌లోని ఆమె నివాసంలోనే సీబీఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

New Update
sharma

Twisha Sharma Death Case: భోపాల్‌లో సంచలనం సృష్టించిన ట్విషా శర్మ మృతి కేసులో ఒక పెద్ద మలుపు చోటుచేసుకుంది. రిటైర్డ్ మహిళా జడ్జి గిరిబాల సింగ్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. భోపాల్‌లోని ఆమె నివాసంలోనే సీబీఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరణించిన 33 ఏళ్ల ట్విషా శర్మకు ఈ గిరిబాల సింగ్ అత్తగారు అవుతారు. పెళ్లయిన కొద్ది రోజులకే ట్విషా శర్మ తన అత్తవారింట్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో గిరిబాల సింగ్‌కు గతంలో కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అయితే, బుధవారం నాడే మధ్యప్రదేశ్ హైకోర్టు ఆమె బెయిల్‌ను రద్దు చేసింది. కోర్టు బెయిల్ రద్దు చేసిన మరుసటి రోజే సీబీఐ రంగంలోకి దిగి ఆమెను అరెస్ట్ చేయడం గమనార్హం. గురువారం ఉదయాన్నే భోపాల్‌లోని బాగ్ ముఘలియా ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో ఉన్న గిరిబాల సింగ్ ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆమెను కొన్ని గంటల పాటు ప్రశ్నించిన తర్వాత అధికారికంగా అరెస్ట్ చేశారు. ఒక మాజీ జడ్జి కుటుంబం ఈ కేసులో ఇరుక్కోవడం, పైగా కట్నం వేధింపులు, సాక్ష్యాల జాప్యం వంటి ఆరోపణలు రావడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.

Also Read: “పెద్ది గురించి చెప్పు చరణ్!” మోదీ అడిగిన ప్రశ్న వైరల్!

మే 12న ట్విషా శర్మ మరణించిన వెంటనే, గిరిబాల సింగ్ కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే, ట్విషా తల్లిదండ్రులు ఈ బెయిల్‌ను సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లారు. విచారణను అడ్డుకోవడానికి, తప్పుించుకోవడానికి నిందితులు ప్రయత్నిస్తున్నారనే వాదనలను పరిశీలించిన మధ్యప్రదేశ్ హైకోర్టు.. గిరిబాల సింగ్‌కు ఉన్న బెయిల్‌ను రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో సీబీఐ ఆమెను అరెస్ట్ చేయడానికి దారి సుగమమైంది.

మే 23న అరెస్ట్

ట్విషా శర్మ భర్త, వృత్తిరీత్యా లాయర్ అయిన సమర్థ్ సింగ్‌ను భోపాల్ పోలీసులు ఇప్పటికే మే 23న అరెస్ట్ చేశారు. భార్య చనిపోయిన తర్వాత దాదాపు 10 రోజుల పాటు పరారీలో ఉన్న అతడిని జబల్‌పూర్ జిల్లా కోర్టు ఆవరణలో పోలీసులు పట్టుకున్నారు. అంతకుముందు అతను హైకోర్టులో వేసుకున్న బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకుని, లోకల్ కోర్టులో లొంగిపోవాలని అనుకున్నాడు. కానీ ఈలోపే పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, విచారణ కోసం ఏడు రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు వారి వాట్సాప్ చాట్లు, ఫోన్ రికార్డులను పరిశీలిస్తున్నారు.

Also Read: ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా!

రిటైర్డ్ జడ్జి గిరిబాల సింగ్ కుమారుడైన సమర్థ్ సింగ్‌తో ట్విషా శర్మకు వివాహం జరిగింది. పెళ్లయిన కేవలం ఐదు నెలలకే, మే 12న భోపాల్‌లోని అత్తవారింట్లో ట్విషా శర్మ శవమై కనిపించింది. ప్రాథమిక విచారణ ప్రకారం ఆమె ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. అయితే, పెళ్లయినప్పటి నుంచి అత్త, భర్త తనను తీవ్రంగా మానసిక వేధింపులకు గురిచేశారని ట్విషా కుటుంబ సభ్యులు ఆరోపించారు.

కోర్టు విచారణ సమయంలో ట్విషా పంపిన కొన్ని వాట్సాప్ మెసేజ్‌లను ఆధారాలుగా చూపించారు. ఆ మెసేజ్‌లలో "నాకు ఈ ఇంట్లో ఊపిరాడట్లేదు, ఇక్కడి నుంచి వచ్చేయాలని ఉంది" అని ట్విషా తన బాధను పంచుకుంది. గర్భం దాల్చే విషయంలో కూడా ఆమెపై ఒత్తిడి తెచ్చారని, ఆమె చనిపోయాక సాక్ష్యాలను చెరిపేయడానికి ప్రయత్నించారని విమర్శలు వచ్చాయి. కేసు పెట్టడంలో పోలీసులు ఆలస్యం చేయడం, మొదట్లో నిందితులు విచారణకు సహకరించకపోవడంపై ట్విషా కుటుంబం మండిపడింది. ప్రస్తుతం అత్త గిరిబాల సింగ్, భర్త సమర్థ్ సింగ్ ఇద్దరూ జైల్లోనే ఉండటంతో సీబీఐ ఈ కేసు విచారణను మరింత వేగవంతం చేసింది.

Advertisment
తాజా కథనాలు