/rtv/media/media_files/2025/02/15/TZuE8wCRjwBcb1wsufaV.jpg)
accident
Road accident : ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న ఒకే కుటుంబంలో నలుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం విషాదాన్ని మిగిల్చింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కైంచి ధామ్ ఆలయ దర్శనానికి వెళ్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు కాగా, మరొకరు కారు డ్రైవర్ అని పోలీసులు ధృవీకరించారు.
नैनीताल जनपद में वाहन दुर्घटनाग्रस्त होने का दुःखद समाचार प्राप्त हुआ। ईश्वर से प्रार्थना है कि दिवंगतों की आत्मा को श्रीचरणों में स्थान एवं शोक संतप्त परिजनों को यह असीम दुःख सहन करने की शक्ति प्रदान करें।
— Pushkar Singh Dhami (@pushkardhami) May 21, 2026
स्थानीय प्रशासन एवं SDRF द्वारा राहत एवं बचाव कार्य जारी है। ईश्वर से…
ఉత్తరాఖండ్‌లోని ఖతీమా ప్రాంతానికి చెందిన భూపేంద్ర సింగ్ చుఫాల్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి కైంచి ధామ్ ఆలయాన్ని సందర్శించేందుకు కారులో బయలుదేరారు. వారి వాహనం నైనిటాల్ జిల్లాలోని ధైలా గ్రామం వద్దకు చేరుకోగానే.. శానిటోరియం-రతిఘాట్ బైపాస్ రోడ్డుపై ఒక్కసారిగా అదుపు తప్పింది. పక్కనే ఉన్న దాదాపు 500 మీటర్ల లోతైన లోయలోకి కారు దూసుకుపోయింది. వాహనం వేగంగా పడటంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసు సిబ్బందితో పాటు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. లోయ చాలా లోతుగా ఉండటంతో స్థానికుల సహాయంతో ఎంతో శ్రమించి బాధితులను వెలికితీశారు. అనంతరం వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
మరణించిన వారిలో భూపేంద్ర సింగ్ చుఫాల్ (48) – కుటుంబ యజమాని, సీమా కైదా చుఫాల్ (45) – భార్య ,వాసు చుఫాల్ (19) – కుమారుడు, రవి చుఫాల్ (12) – కుమారుడు, అనుజ్ కుమార్ మిశ్రా (34) – కారు డ్రైవర్ ఉన్నారు. "బైపాస్ మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలో వాహనం అదుపు తప్పడమే ఈ ఘోర ప్రమాదానికి ప్రాథమిక కారణం." అనినైనిటాల్ ఎస్పీ జగదీశ్ చంద్ర తెలిపారు.
ఈ ప్రమాదానికి సంబంధించి స్థానికులు పలు కీలక విషయాలను తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం కైంచి ధామ్ బైపాస్ మార్గంలో విస్తరణ లేదా పునరుద్ధరణ నిర్మాణ పనులు జరుగుతున్నాయని వారు తెలిపారుప్రమాదం జరిగిన రోడ్డు పక్కన కనీస భద్రతా చర్యలు (క్రాష్ బారియర్స్ లేదా పారాపెట్ గోడలు) లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు.మలుపులు, కొండ ప్రాంతాల వద్ద వాహనదారులను అప్రమత్తం చేసేందుకు ఎలాంటి సైన్ బోర్డులు ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్పందించిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి
ఈ ఘోర ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందని ట్విట్టర్ (X) ద్వారా పేర్కొన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు. అలాగే, బాధిత కుటుంబాలకు తక్షణమే అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని జిల్లా యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు.
Follow Us