TN Governor : విజయ్కు గవర్నర్ మూడు ప్రశ్నలు.. దళపతి ఏం చెప్పాడంటే?

తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామాకు తెరపడింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌కు, టీవీకే అధినేత విజయ్‌కు మధ్య జరిగిన చర్చలు కొలిక్కి వచ్చాయి.  విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి, TVK ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.

New Update
govrnor

తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామాకు తెరపడింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌కు, టీవీకే అధినేత విజయ్‌కు మధ్య జరిగిన చర్చలు కొలిక్కి వచ్చాయి.  విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి, TVK ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసే ముందు రాజ్ భవన్ లో  గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్..  విజయ్ ను  కొన్ని కీలక ప్రశ్నలు అడిగారు.

  • మీ దగ్గర ప్రస్తుతం 113 మంది ఎమ్మెల్యేల (108 టీవీకే + 5 కాంగ్రెస్) మద్దతు మాత్రమే ఉంది. 118 మంది కావాలి కదా.. ఆ లోటును ఎలా భర్తీ చేస్తారు?
  • ఈ తక్కువ సంఖ్యతో ఐదేళ్ల పాటు స్థిరమైన ప్రభుత్వాన్ని ఎలా నడపగలరు? ఎవరైనా మద్దతు 'ఉపసంహరించుకుంటే పరిస్థితి ఏంటి?
  • మీకు మద్దతు ఇచ్చే ఇతర పార్టీలు లేదా ఎమ్మెల్యేలు ఎవరున్నారు? వారి అప్‌డేట్ లిస్టు నాకు ఇవ్వండి.

అసెంబ్లీలో ఫ్లోర్ టెస్టు

గవర్నర్ అడిగిన ప్రశ్నలకు విజయ్ చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చారు. "అతిపెద్ద పార్టీగా మాకు అవకాశం ఇవ్వడం రాజ్యాంగబద్ధమైన ఆనవాయితీ. నా బలాన్ని నేను రాజ్‌భవన్‌లో కాదు.. అసెంబ్లీలోనే నిరూపించుకుంటాను" అని ఆయన ఖరాఖండిగా చెప్పారు. అంతేకాకుండా చిన్న పార్టీల ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని ఆయన వివరించారు. విజయ్ వివరణతో గవర్నర్ సంతృప్తి చెందినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్‌ను గవర్నర్ ఆహ్వానించారు. మే 7వ తేదీన సాయంత్రం లేదా రాత్రికి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 

ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే విజయ్ తన మెజారిటీని అసెంబ్లీలో నిరూపించుకోవాల్సి ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం, సీపీఎం కూడా విజయ్‌కు మద్దతు ఇచ్చే దిశగా ఆలోచిస్తోంది. అదే జరిగితే విజయ్ బలం 115 దాటుతుంది. ఇంకా ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరు విజయ్ కు మద్దతు ఇస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

ఒకవేళ విజయ్ ఫ్లోర్ టెస్ట్ లో విజయ్ నెగ్గకపోతే  గవర్నర్ కొత్త అసెంబ్లీని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి సిఫార్సు చేస్తారు. అదే జరిగితే రాష్ట్రం మళ్ళీ ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది. ప్రస్తుతం టీవీకేకు చెందిన 107 మంది ఎమ్మెల్యేలు చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలోని మహాబలిపురం రిసార్ట్‌లో క్యాంపులో ఉన్నారు. రాజకీయాలకు విజయ్ కొత్త కావొచ్చు కానీ, ఇక్కడి నియమ నిబంధనలు ఆయనకు బాగా తెలుసని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు