Byju's: కోట్ల నుంచి సున్నాకు..బైజూస్ పతనం ఎడ్యుకేషన్‌తో బిజినెస్ ఎలా చేయాలో నేర్పించిన సంస్థ...ఒకప్పుడు బిజినెస్‌లో రారాజు. కానీ ఇప్పుడు పూర్తిగా పతనం అయిపోయిన సున్నాకు వచ్చేసింది. ఇదంతా తన అతి అంచనాల వల్లనే అంటున్నారు బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్. By Manogna alamuru 18 Oct 2024 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Byjus Ravindran: విద్యతో వ్యాపారం ఎప్పటి నుంచో ఉన్నదే. స్కూళ్ళు, కాలేజీల పేరిటి చాలా మంది కోట్ల సంపాదించారు. అయితే ఆన్‌లైన్‌లో ఎడ్యుకేషన్ ...అప్పటికి ఇది అంతగా ప్రాచుర్యం పొందని కాన్సెప్ట్. దీన్ని డెవలప్ చేసి విపరీతంగా బిజినెస్ చేసింది మాత్రం బైజూస్. కోవిడ్ టైమ్‌లో బైజూస్ ఎడ్యుకేషన్ పీక్స్‌లో ఉండేది. అప్పుడు అసలే లాక్‌డౌన్, తరువాత బయటకు వెళ్ళాలంటే భయంతో ఉండేవారు జనాలు. అలాంటి టైమ్‌లో పిల్లలకుఇంట్లోనే ఆన్‌లైన్ క్లాసులు చెప్పి...బాగా ప్రాచుర్యం పొందింది బైజూస్. రెండేళ్ళల్లో టాప్ పొజిషన్‌కు వెళ్ళింది. 2022లో దీని వాల్యుయేషన్ $22 బిలియన్లకు చేరుకుంది. Also Read: Stock Market:ఎట్టకేలకు లాభాల్లో సూచీలు..కాస్త మెరుగ్గా మార్కెట్ ఇన్వెస్టర్లు పారిపోయారు.. అయితే తరువాత పరిస్థితులు మారిపోయాయి. కోవిడ్ తగ్గింది. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ బిజినెస్లో పోటీ పెరిగింది. అన్నింటికంటే ముఖ్యంగా ఆన్ లైన్ ఎడ్యుకేషన్‌కు ప్రాముఖ్యత కూడా బాగా తగ్గిపోయింది. అక్కడి నుంచి బైజూస్ పతనం మొదలైంది. దీంతో నెలల తరబడి బకాయిలు చెల్లించలేని స్థితికి చేరుకుంది. దేశంలో ఉన్న బైజూస్ ఆఫీస్‌లన్నీ దాదాపు మూతబడిపోయాయి. మరోవైపు కంపెనీ తీసుకున్న 1 బినియన్‌ను దుర్వినియోగం చేశాంటూ అమెరికాలోని రుణదాతలు కోర్టులో వేశారు. అయితే ఈ కేసు ఇంకా తేలలేదు. అవన్నీ తప్పుడు అభియోగాలని అంటారు బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్. కానీ తన ఎడ్యుకేషన్-టెక్నాలజీ కంపెనీ వృద్ధి సామర్థ్యాన్ని తాను ఎక్కువగా అంచనా వేసానని..అందుకే బైజూస్ పడిపోయిందని చెబుతున్నారు. ఇది కాకుండా గత ఏడాది ఒకేసారి బైజూస్ ప్రధాన ఇన్వెస్టైర్లెన ప్రోసుస్, పీక్ ఎక్స్‌వీ పార్ట్‌నర్స్, చాన్ జూకర్‌బర్గ్ ఇనీషియేటివ్‌లు సంస్థ బోర్డు నుంచి వైదొలగడం పెద్ద దెబ్బ అని చెబుతున్నారు. ఇప్పుడు బైజూస్‌కు నిధులు సమకూర్చడం కూడా చాలా కష్టమవుతుందని తెలిపారు. ప్రస్తుతం సంస్థకు ఉన్న వాల్యూ సున్నా అని అంటున్నారు రవీంద్రన్. Also Read: ఫుట్‌పాత్ ఆక్రమణలే టార్గెట్.. హైడ్రా నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఇదే! మరో ఎడ్ టెక్.. బైజూస్‌ను సపోర్ట్ చేసిన ఇన్వెస్టర్లు...కంపెనీలో సమస్యలు ప్రారంభం కాగానే పారిపోయారని వాపోతున్నారు రవీంద్రన్. కంపెనీ తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇచ్చినప్పుడు...ఇప్పుడు వైఫల్యానికి బాధ్యత తీసుకోవడం లేదని అంటున్నారు. ఎడ్యు టెక్ దిగ్గజం బైజూస్ వైఫల్యంలో ఇన్వెస్టర్ల పాత్ర కూడా ఉందని బైజూ రవీంద్రన్ అన్నారు. మేనేజ్ మెంట్‌లో కూడా అర్థం పర్థం లేకుండా మార్పులు చేయమని అడుగుతున్నారని రవీంద్రన్ మండిపడ్డారు. ఈ ఫిబ్రవరిలో బైజూస్ టాప్ ఇన్వెస్టర్లు (investments) సోఫినా, పీక్ ఎక్స్ వి, ప్రోసస్, జనరల్ అట్లాంటిక్ వంటి వారు రవీంద్రన్ ను మేనేజ్మెంట్ నుంచి తొలగించడానికి కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి కంపెనీ దివాలా బాట పట్టింది. తానెక్కడికీ పారిపోలేదని...తన తండ్రి చికిత్స కోసం దుబాయ్ వెళ్ళానని చెప్పారు. త్వరలోనే ఇండియాకు వస్తానని...మరో ఎడ్ టెక్ ప్రారంభిస్తానని చెప్పారు. తాను ప్రస్తుతం మానసికంగా చాలా ఉత్సాహంగా ఉన్నానని..తిరిగి బోధనలోకి రావడానికి చూస్తున్నాని రవీంద్రన్ చెప్పారు. Also Read: Isha ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట Also Read: షేక్ హసీనాను మోదీ బంగ్లాదేశ్‌కి అప్పగిస్తారా? మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి