Priyanka Gandhi : దేశ మహిళలను బీజేపీ తప్పుదోవ పట్టిస్తోంది..ప్రియాంకగాంధీ కౌంటర్‌ ఎటాక్‌

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు, డీ లిమిటేషన్‌ బిల్లులపై సుదీర్ఘ చర్చ జరుగుతుంది. కాగా ప్రధాని నరేంద్రమోడీ బిల్లుపై చర్చించిన అనంతరం ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ స్పందించింది. ఆ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ మోదీ ప్రసంగంపై కౌంటర్‌ ఎటాక్‌ ఇచ్చారు.

New Update
Priyanka Gandhi heads panel to shortlist Assam Congress candidates

Priyanka Gandhi

Priyanka Gandhi : లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు, డీ లిమిటేషన్‌ బిల్లులపై సుదీర్ఘ చర్చ జరుగుతుంది. కాగా ప్రధాని నరేంద్రమోడీ బిల్లుపై చర్చించిన అనంతరం ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ స్పందించింది. ఆ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ మోదీ ప్రసంగంపై కౌంటర్‌ ఎటాక్‌ ఇచ్చారు.

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు తొలుత మోతీలాల్‌ నెహ్రూ చొరవ చూపించారన్న ప్రియాంక.మహిళల హక్కుల విషయంలో తామే ఛాంపియన్స్‌ లా గా బీజేపీ నటిస్తోందని ఎద్దేవా చేశారు.బిల్లు విషయంలో బీజేపీ దేశ మహిళలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. మహిళా బిల్లును ముందుగా కాంగ్రెస్‌ ప్రవేశ పెట్టిందని ఆరోజు బీజేపీ కూడా మహిళా రిజర్వేషన్‌ బిల్లును వ్యతిరేకించిందని గుర్తు చేశారు.

అయతే ఇక్కడ ఇష్యూ మహిళా రిజర్వేషన్లు కాదన్న ప్రియాంక గాంధీ   బిల్లును ఎవరూ కూడా వ్యతిరేకించలేదన్నారు. రాహుల్‌ స్వయంగా మోడీ వద్దకు వెళ్లి మద్దతు తెలిపారని గుర్తు చేశారు. అయినా మహిళా బిల్లుపై కాంగ్రెస్‌ కు మోడీ క్రెడిట్‌ ఇవ్వలేదని ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా మహిళా బిల్లుకు మా మద్దతు ఉంటుందన్న ప్రియాంక గాంధీ తాము అభ్యంతరం తెలుపుతుంది డీలిమిటేషన్‌ గురించి మాత్రమేనని స్పష్టం చేశారు. కులగణనకు ప్రధాని మోడీ బయపడుతున్నారని ప్రియాంక ఆరోపించారు.సభలో బిల్లులను ప్రవేశపెట్టడానికి ముందు జనగణన ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు.మేము డీ లిమిటేషన్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేసిన ప్రియాంక డీ లిమిటేషన్‌  వల్ల కొన్ని రాష్ర్టాలకు అన్యాయం జరుగుందని ఆభ్యంతరం వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు