AIADMK : పళనిస్వామికి బిగ్ షాక్ ..అన్నాడీఎంకే లో చీలిక....40 మంది ఎమ్మెల్యేల జంప్‌?

సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో అన్నాడీఎంకేలో (AIADMK) కీలక పరిణామం చోటు చేసుకుంది. కొత్తగా ఎన్నికైన మెజారిటీ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేయడం సంచలనంగా మారింది.

New Update
FotoJet - 2026-05-06T102557.538

Big shock for Palaniswami..split in AIADMK....jump of 40 MLAs?

AIADMK : తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో (AIADMK) కీలక మార్పులు కనిపిస్తున్నాయి.  కొత్తగా ఎన్నికైన మెజారిటీ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని తమ పార్టీ అధిష్టానాన్ని కోరడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.  

మైలం నియోజకవర్గం నుంచి విజయం సాధించిన సీనియర్ నేత సీ వీ షణ్ముగం ఈ ప్రతిపాదనను పార్టీ ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డిఎంకె (DMK) ప్రధాన ప్రతిపక్ష పాత్రలోకి వెళ్తున్న తరుణంలో, మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా ఏఐఏడీఎంకే తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. మెజారిటీ ఎమ్మెల్యేలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, పార్టీ జనరల్ సెక్రటరీ ఎడప్పాడి కే పళనిస్వామి (EPS) ని ఈ దిశగా ఆలోచించాలని కోరారు. అన్నాడీఎంకే తరుపున గెలిచిన 47 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది టీవీకేకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ రోజు ఏర్పాటు చేయ తలపెట్టిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశాన్ని పళనిస్వామి అర్థంతరంగా రద్దు చేసుకున్నారు.

మరోవైపు, డిఎంకె కూటమి నుంచి బయటకు వచ్చి విజయ్ నేతృత్వంలోని టీవీకేకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఇప్పటికే సిద్ధమైనట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో, ఏఐఏడీఎంకే కూడా మద్దతు ప్రకటిస్తే రాష్ట్రంలో కొత్త తరహా రాజకీయ కూటమి ఏర్పడే అవకాశం ఉంది. "ఇది కేవలం టీవీకేకి వచ్చిన ప్రజా తీర్పును గౌరవించడం మాత్రమే కాదు, భవిష్యత్తులో ఏఐఏడీఎంకే పార్టీని రాజకీయంగా క్రియాశీలకంగా ఉంచడం కూడా ముఖ్యమే" అని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. 234 సీట్లున్న అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ (118) కు కొద్ది దూరంలో టీవీకే నిలిచిన తరుణంలో, ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేల ఈ నిర్ణయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే ఎడప్పాడి పళనిస్వామి ఈ విషయంపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అన్నాడీఎంకే నుంచి గెలుపొందిన మెజారిటీ ఎమ్మెల్యేలు.. రాష్ట్రంలో డీఎంకేను నిరోధించేందుకు టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడమే సరైన మార్గమని భావిస్తున్నారు.  ఎమ్మెల్యేల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి (EPS) సానుకూల నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని గౌరవించి, టీవీకేకు మద్దతు తెలపడం ద్వారా డీఎంకే కూటమిని దెబ్బకొట్టవచ్చని వారు భావిస్తున్నారు.ఈ పరిణామం తమిళనాడులో పాత మిత్రపక్షాల సమీకరణాలను మార్చే అవకాశం ఉంది. అన్నాడీఎంకే ప్రస్తుతం ఉన్న బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చేందుకు ఇదే సరైన సమయమని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు.

 మరోవైపు, డీఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ బయటకు వచ్చి, విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతుండటం డీఎంకేకు పెద్ద దెబ్బగా మారింది. ఒకవేళ అన్నాడీఎంకే ఎమ్మెల్యేల కోరిక నెరవేరి, ఆ పార్టీ టీవీకేకు మద్దతు ఇస్తే, తమిళనాడులో సరికొత్త రాజకీయ శకం మొదలవుతుంది. విజయ్ ముఖ్యమంత్రి కావడానికి అవసరమైన బలం సునాయాసంగా సమకూరుతుంది. అన్నాడీఎంకే, కాంగ్రెస్ వంటి పార్టీల మద్దతుతో టీవీకే ప్రభుత్వం సుస్థిరంగా ఉండే అవకాశం ఉంది. పళనిస్వామి ఈ ప్రతిపాదనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపైనే ఇప్పుడు తమిళనాడు భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒకవేళ ఆయన సరైన నిర్ణయం తీసుకోని పక్షంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా చీలిపోయే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పళనిస్వామి పావులు కదుపుతున్నారు.

Advertisment
తాజా కథనాలు