NEET స్కామ్‌లో మైండ్ బ్లాంక్ మిస్టరీ..  ఒకే ఫ్యామిలీలో 5 మెడికల్ సీట్లు!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ పేపర్ లీక్ కేసు దర్యాప్తులో రోజుకో ఒక షాకింగ్ నిజం బయటపడుతోంది. ఈ స్కామ్‌లో రాజస్థాన్‌కు చెందిన బివాల్ కుటుంబం కేంద్ర బిందువుగా మారింది.

New Update
neet exam

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ పేపర్ లీక్ కేసు దర్యాప్తులో రోజుకో ఒక షాకింగ్ నిజం బయటపడుతోంది. ఈ స్కామ్‌లో రాజస్థాన్‌కు చెందిన బివాల్ కుటుంబం కేంద్ర బిందువుగా మారింది. క్లాస్ రూమ్‌లో కనీసం పాస్ మార్కులు తెచ్చుకోలేని యావరేజ్ స్టూడెంట్స్.. దేశంలోనే అత్యంత కఠినమైన నీట్ ఎగ్జామ్‌లో అసాధారణ స్కోర్లు సాధించి టాప్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు సంపాదించడం ఇప్పుడు సీబీఐ (CBI) అధికారులనే విస్మయానికి గురిచేస్తోంది.

రాజస్థాన్‌లోని జమ్వా రామ్‌గఢ్‌కు చెందిన దినేష్ బివాల్, మాంగీలాల్ బివాల్ అనే బ్రదర్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. ఈ ఇద్దరితో పాటు మాంగీలాల్ కొడుకు వికాస్ బివాల్‌ను ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసింది. హర్యానాకు చెందిన పేపర్ సప్లయర్ యాష్ యాదవ్ నుండి వీరు రూ. 15 నుండి 30 లక్షలు పెట్టి లీకైన పేపర్‌ను కొనుగోలు చేసి, ఆ తర్వాత సికార్‌లోని కోచింగ్ నెట్‌వర్క్స్‌కు భారీ లాభాలకు అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, దర్యాప్తు సంస్థల దృష్టి ఇప్పుడు గత ఏడాది నీట్ పాసైన ఈ కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలపై పడింది. వీరి అకడమిక్ రికార్డులు చూస్తే మైండ్ బ్లాంక్ అవుతోంది.

వికాస్ బివాల్ 

ఇంటర్ (12వ తరగతి)లో కేవలం 55% మార్కులు వచ్చాయి. కానీ నీట్ ఎగ్జామ్‌లో ఏకంగా 86% స్కోర్ సాధించి సవాయ్ మాధోపూర్ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించాడు. కాలేజీ ప్రిన్సిపాల్ బి.పి. మీనా తెలిపిన వివరాల ప్రకారం.. వికాస్ నెలకు ఒకటి రెండు సార్లు మాత్రమే కాలేజీకి వచ్చేవాడు. కాలేజీ టెస్టుల్లో అతడికి వచ్చిన యావరేజ్ మార్కులు కేవలం 30% మాత్రమే! ప్రస్తుతం ఇతడిని సీబీఐ అరెస్ట్ చేసింది.

2. పలక్ బివాల్ 

టెన్త్‌లో 93%, ఇంటర్‌లో 89% తెచ్చుకున్న ఈమె, నీట్‌లో ఏకంగా 98.61 పర్సంటైల్ సాధించి జైపూర్‌లోని ప్రతిష్టాత్మక SMS మెడికల్ కాలేజీలో సీటు కొట్టేసింది. కాలేజీ టెస్టుల్లో ఈమె పెర్ఫార్మెన్స్ చాలా యావరేజ్‌గా ఉండేది. బుధవారం తన బాబాయ్ దినేష్‌ను సీబీఐ అరెస్ట్ చేసిందని తెలియగానే, హాస్టల్ నుండి ఎవరికీ చెప్పకుండా పలక్ పారిపోయింది. ప్రస్తుతం ఈమె ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది.

3. ప్రగతి బివాల్

టెన్త్‌లో కేవలం 69% మార్కులు వచ్చాయి. కోవిడ్ సమయంలో ఇంటర్‌లో 91% రాగా, నీట్‌లో 89% స్కోర్ చేసి దౌసా మెడికల్ కాలేజీలో సీటు సాధించింది. తండ్రి, అన్న అరెస్ట్ అయిన రోజు నుండే ఈమె కాలేజీకి లీవ్ పెట్టి పరారైంది.

4. సానియా బివాల్ 

 టెన్త్‌లో కేవలం 63% మార్కులే వచ్చాయి. ఇంటర్‌లో 89% రాగా, నీట్‌లో ఏకంగా 94.07 పర్సంటైల్ సాధించి ముంబైలోని ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించింది. ప్రస్తుతం ఈమె కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది.

5. గుంజన్ బివాల్ 

ఇంటర్‌లో కేవలం 70% మార్కులు వచ్చాయి. సికార్‌లోని కోచింగ్ సెంటర్లలో పెట్టిన గ్రాండ్ టెస్టుల్లో ఈమెకు 720 మార్కులకు గానూ కేవలం 320 నుండి 342 మార్కులు మాత్రమే వచ్చేవి. కానీ అసలు నీట్ ఎగ్జామ్‌లో మాత్రం ఏకంగా 92.53 పర్సంటైల్ సాధించి వారణాసి మెడికల్ కాలేజీలో సీటు కొట్టేసింది. ప్రస్తుతం ఈమె కూడా కనిపించకుండా పోయింది.

Advertisment
తాజా కథనాలు