/rtv/media/media_files/2025/02/08/4p0rv10GXloBgKD5x8OT.jpg)
ravinder singh
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పట్పర్‌గంజ్ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి రవీంద్ర సింగ్ నేగి గెలుపోదారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి అవధ్ ఓజాను ఆయన 23 వేల 280 ఓట్ల తేడాతో ఓడించారు. ఆమ్ ఆద్మీ పార్టీ 2013 నుండి పట్పర్‌గంజ్ స్థానాన్ని గెలుచుకుంటూ వస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మనీష్ సిసోడియా ఇక్కడి నుంచి గెలుపోందారు. ఈ ఎన్నికల్లో సిసోడియాకు రవీంద్ర నేగి గట్టి పోటీ ఇచ్చి కేవలం 2% ఓట్ల తేడాతో ఓడిపోయారు.
అయితే ఈ ఎన్నికల్లో సిసోడియా తన సీటును పట్పర్‌గంజ్ నుంచి కాకుండా జంగ్‌పురా నుండి పోటీ చేశారు. కానీ అక్కడ కూడా ఆయన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈసారి పట్పర్‌గంజ్ స్థానంలో బీజేపీ , ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య గట్టి పోటీ కనిపించింది. చివరికి రవీంద్ర సింగ్ నేగి ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ బహిరంగ సభలో రవీంద్ర సింగ్ నేగి పాదాలకు నమస్కరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
VIDEO | Delhi Elections 2025: PM Modi (@narendramodi) meets BJP candidates during 'Sankalp Rally' at Kartar Nagar.#DelhiElectionsWithPTI #DelhiElections2025
— Press Trust of India (@PTI_News) January 29, 2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/H3sM0z63h3
ఉత్తరాఖండ్ మూలానికి చెందిన
ఎన్నికల ర్యాలీలో రవీంద్ర సింగ్ నేగి ముందుగా ప్రధాని మోడీ పాదాలను తాకగా, మోడీ తిరిగి ఆయనను ఆపి మూడుసార్లు స్వయంగా ఆయన పాదాలను తాకారు. రవీంద్ర సింగ్ నేగి ప్రస్తుతం పట్పర్‌గంజ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే వినోద్ నగర్ నుండి ఎంసీడీ కౌన్సిలర్‌గా ఉన్నారు. ఈయన ఉత్తరాఖండ్ మూలానికి చెందినవాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన 25 లక్షల మంది ప్రజలు ఢిల్లీలో నివసిస్తున్నారు. వారిలో 15 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రవీంద్ర సింగ్ నేగి వయస్సు 48 సంవత్సరాలు. అతను గ్రాడ్యుయేట్. అతని నికర ఆస్తి విలువ రూ. 1.8 కోట్లు కాగా అప్పు రూ. 16 లక్షలుగా ఉంది.