/rtv/media/media_files/2026/05/08/vijay-damu-2026-05-08-10-00-45.jpg)
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) చుట్టూ వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాయపురం నియోజకవర్గం నుంచి గెలిచిన టీవీకే అభ్యర్థి విజయ్ దాము ప్రయాణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక సాదాసీదా ఆటో డ్రైవర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగారంటూ మే 4న ఫలితాలు వచ్చినప్పటి నుండి ఆయన కథనం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. అయితే, ఇప్పుడు ఆయన ఎన్నికల అఫిడవిట్ బయటకు రావడంతో నెటిజన్లు ఆయన కథపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రాయపురంలో ఇద్దరు రాజకీయ దిగ్గజాలైన మాజీ మంత్రి డి. జయకుమార్ (AIADMK), మాజీ మంత్రి రెహమాన్ ఖాన్ కుమారుడు డాక్టర్ ఎ. సుబైర్ ఖాన్ (DMK)లను ఓడించి విజయ్ దాము సంచలనం సృష్టించారు. 8వ తరగతి వరకే చదువుకున్న దాము ఒక సాధారణ ఆటో డ్రైవర్ అని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ, ఆయన ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
విజయ్ దాము అఫిడవిట్ ప్రకారం.. ఆయన సొంతంగా ఆటో లేదు. ఆయనకు ఇన్నోవా కార్ తో పాటుగా రెండు ఖరీదైన బైకులున్నాయి. దాము ఆటో డ్రైవర్ కాదు కానీ ఆటో కన్సల్టింగ్ బిజినెస్ చేస్తారు. ఆయనకు మొత్తం రూ. 28.9 లక్షల ఆస్తులు ఉన్నట్లు, ఎటువంటి అప్పులు లేవని ప్రకటించారు.
/filters:format(webp)/rtv/media/media_files/2026/05/08/2-2026-05-08-10-00-38.jpg)
40 శాతం క్రిమినల్ కేసులు
కేవలం విజయ్ దాము వివాదమే కాకుండా, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) విశ్లేషణ ప్రకారం టీవీకే పార్టీలో గెలిచిన , పోటీ చేసిన అభ్యర్థులపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీవీకే విశ్లేషించిన 231 మంది అభ్యర్థులలో 92 మంది అంటే 40 శాతం క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్‌లో స్వయంగా ప్రకటించారు. వారిలో 43 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. కొందరు అభ్యర్థులు తమపై ఉన్న పాత ఎఫ్‌ఐఆర్‌ల వివరాలను అఫిడవిట్‌లో పూర్తిగా వెల్లడించలేదని, దీనివల్ల భవిష్యత్తులో వారు ఎమ్మెల్యేలుగా అనర్హత వేటుకు గురయ్యే ప్రమాదం ఉందనే వార్తలు వస్తున్నాయి.
వ్యవస్థను ప్రక్షాళన చేస్తానని రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ పార్టీ ఎమ్మెల్యేలపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలకు ఆయుధంగా మారింది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 మంది మద్దతు కావాలని గవర్నర్ పట్టుబడుతున్న వేళ, ఈ కొత్త వివాదాలు విజయ్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి.
ఇక ఎమ్మెల్యే కె.వి. విజయ్ దాము పుట్టినరోజు వేడుకలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. చెన్నైలోని ఒక ప్రైవేట్ హాల్‌లో జరిగిన తన 46వ పుట్టినరోజు వేడుకల్లో విజయ్ దాము ఒక భారీ కత్తితో కేక్ కట్ చేయడం వివాదానికి దారితీసింది. ఆ కత్తి ప్లాస్టిక్ ,చెక్కతో చేసినదని అనుచరులు చెబుతున్నప్పటికీ, దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
த.வெ.க நிர்வாகி லயோலா மணி தடுத்தும் அதை பொருட்படுத்தாமல் வீரவாளை வைத்து கேக் வெட்டி பிறந்தநாள் கொண்டாடிய த.வெ.க. எம்.எல்.ஏ. விஜய் தாமு..
— Polimer News (@polimernews) May 6, 2026
சமூக வலைதளங்களில் வைரலான வீடியோ#TVK | #TVKVijay | #VijayDhamu | #PolimerNewspic.twitter.com/tKB3nADTsu
Follow Us