/rtv/media/media_files/2025/02/09/3nkvE3bnXDxzKcX7lRqB.jpg)
athishi, swathi
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) దారుణంగా ఓడిపోయింది. నాలుగో సారి అధికారంలోకి వద్దామని భావించిన ఆప్ బొక్కాబోర్ల పడింది. భారత ఎన్నికల సంఘం ప్రకారం బీజేపీ 48 సీట్లతో అధికారంలోకి రాగా... ఆప్ 22 సీట్ల వద్దే ఆగిపోయింది. కాంగ్రెస్ మళ్లీ సున్నా సీట్లకే పరిమితం అయింది. అయితే ఆప్ అధికారం కోల్పోయిందని బాధలో ఉంటే సీఎం అతిషి మాత్రం బాగా ఎంజాయ్ చేశారు.
ఆప్ ఘోర ఓటమి పాలైన అదేమి పట్టనట్లుగా ఆ పార్టీ నేత అతిశీ చేసిన పని చర్చకు దారి తీసింది. మరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తను పార్టీ కార్యకర్తలతో కలిసి చిందులు వేశారు. అయితే సొంత పార్టీ ఓడినా అతిశీ ఇలా డాన్స్ చేస్తున్నారేంటని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అతిషి వేడుకలను ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ తీవ్రంగా విమర్శించారు, ఆమె దీనిని సిగ్గులేని ప్రదర్శనగా అభివర్ణించారు. "ఇది ఎలాంటి సిగ్గులేని ప్రదర్శన? పార్టీ ఓడిపోయింది, సీనియర్ నాయకులందరూ ఓడిపోయారు. అతిషి మార్లెనా ఇలా జరుపుకుంటుందా? అని మాలివాల్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ये कैसा बेशर्मी का प्रदर्शन है ? पार्टी हार गई, सब बड़े नेता हार गये और Atishi Marlena ऐसे जश्न मना रही हैं ?? pic.twitter.com/zbRvooE6FY
— Swati Maliwal (@SwatiJaiHind) February 8, 2025
3 వేల 521 ఓట్ల తేడాతో
ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సౌరభ్ భరద్వాజ్ సహా పార్టీ పెద్దలు చాలా మంది ఓడిపోయినందున ఎన్నికల్లో గెలిచిన కొద్దిమంది ఆప్ మంత్రులు, సీనియర్ నాయకులలో అతిషి కూడా ఉన్నారు. 3 వేల 521 ఓట్ల తేడాతో కల్కాజీ సీటును ఆమె కాపాడుకున్నారు. బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరి ఆమెకు గట్టి పోటీనే ఇచ్చారు. కల్కాజీ సీటును అతిషి వరుసగా రెండోసారి గెలుచుకున్నారు. ఎన్నికల సంఘం ప్రకారం, అతిషికి 52 వేల 154 ఓట్లు రాగా, బిధూరికి 48 వేల 633 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు చెందిన అల్కా లాంబా 4,392 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.
Also Read : Delhi Elections: ఆప్ పది శాతం డౌన్...బీజేపీ ఏడు శాతం అప్