అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోలు తొలగింపు.. ఢిల్లీ అసెంబ్లీలో తొలిరోజు రచ్చ రచ్చ!

ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు రసాభాస చోటు చేసుకుంది. సీఎం ఆఫీసులో అంబేద్కర్, భగత్ సింగ్‌ల ఫోటోలను తొలిగించారంటూ ప్రతిపక్ష నాయకురాలు అతిషి ఆరోపించారు. ఇది బీజేపీ దళిత, సిక్కు వ్యతిరేక మనస్తత్వాన్ని రుజువు చేస్తుందని తీవ్రంగా మండిపడ్డారు.

New Update
aap vs bjp photos

ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు రసాభాస చోటు చేసుకుంది. సీఎం ఆఫీసులో బాబా సాహెబ్  బీఆర్ అంబేద్కర్, భగత్ సింగ్‌ల ఫోటోలను తొలిగించారంటూ ప్రతిపక్ష నాయకురాలు అతిషి ఆరోపించారు. ఇది బీజేపీ దళిత, సిక్కు వ్యతిరేక మనస్తత్వాన్ని రుజువు చేస్తుందని తీవ్రంగా మండిపడ్డారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటి సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అంబేద్కర్‌, భగత్‌ సింగ్‌ల ఫొటోలను ఏర్పాటు చేసిన విషయాన్ని  ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు.  బీజేపీ అధికారంలోకి రాగానే వారి ఫొటోలను తొలిగించిందని మండిపడుతూ తమ పార్టీ ఎమ్మెల్యేలతో ఆమె నిరసన చేపట్టారు.  

స్పీకర్‌ తీవ్ర ఆగ్రహం

ఆప్ ఎమ్మెల్యేలు చేపడుతున్న నిరసనలపై అసెంబ్లీ స్పీకర్‌ విజేందర్ గుప్తా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతిషి ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నానని అసెంబ్లీ స్పీకర్ అన్నారు. ప్రతిపక్షాలు సభను సజావుగా జరగనివ్వడం లేదని తాను భావిస్తున్నానని విజేంద్ర గుప్తా అన్నారు. ప్రతిపక్షాలు చట్టాలను ఉల్లంఘిస్తే  సహించబోమని అన్నారు.  మీరు సభ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారంటూ ఆప్ ఎమ్మెల్యేలపై స్పీకర్‌ ఫైరయ్యారు.  అయినప్పటికీ ఆప్ ఎమ్మెల్యేలు శాంతించకపోవడంతో సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.

అంబేద్కర్, భగత్ సింగ్‌ల ఫోటోలను తొలిగించారంటూ అతిషి చేసిన ఆరోపణలపై  ముఖ్యమంత్రి రేఖ గుప్తా స్పందించారు. సీఎం కార్యాలయంలో వారి ఫోటోలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆ రెండు ఫోటోలు సీఎం కుర్చికి వెనుక కాకుండా ఎదురుగా ఉన్నాయని తెలిపారు.  ఇక సీఎం కార్యాలయంలో కొత్తగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మహాత్మా గాంధీ,  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోలు కొత్తగా ఏర్పాటు చేశారు.  

Also Read :  పాకిస్థాన్లో హై అలెర్ట్ :  ఛాంపియన్స్ ట్రోఫీ ఎఫెక్ట్.. రంగంలోకి ఉగ్రవాదులు!

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు