Maoist party : మావోయిస్టు పార్టీకి మరో షాక్‌.. మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు పాపారావు లొంగుబాటు ?

మావోయిస్టు పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు అగ్రనాయకులు లొంగిపోగా, మరో మావోయిస్టు నేత మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న పశ్చిమ బస్తర్‌ డివిజన్‌ కమాండర్‌ పాపారావు ఎలియాస్‌ సున్నం చంద్రయ్య లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు.

New Update
FotoJet (31)

Most wanted Maoist Papa Rao surrenders?

Maoist party : మావోయిస్టు పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు అగ్రనాయకులు లొంగిపోగా, పలువురు ఎన్‌కౌంటర్లలో మృతి చెందారు. కాగా మరో మావోయిస్టు నేత మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న పశ్చిమ బస్తర్‌ డివిజన్‌ కమాండర్‌ పాపారావు ఎలియాస్‌ సున్నం చంద్రయ్య లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. ఆయన లొంగుబాటు కోసం ప్రయత్నిస్తున్న మధ్యవర్తులు ఈ మేరకు ఛత్తీస్‌గఢ్‌లోని నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతంలోకి వెళ్లి ఆయనతో చర్చలు సాగించారు.  పాపరావుతో పాటు సుమారు 12 నుంచి 17 మంది తన అనుచరులు కూడా బీజాపూర్‌ ఎస్పీ ఎదుట లొంగిపోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఆయనపై రూ.25 లక్షల రివార్డు ఉంది.

కాగా  పాపారావు కోసం భద్రతా బలగాలు అటవీ ప్రాంతంలో ప్రత్యేక కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్నారు. అదే సమయంలో లొంగుబాటు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.  అందుకోసమే ఆయనతో చర్చించడానికి  మధ్యవర్తులు అటవీ ప్రాంతానికి వెళ్లారు.దీనిపై పోలీసు ఉన్నతాధికారులు అధికారికంగా వెల్లడించాల్సింది ఉంది. 

కాగా పాపరావు లొంగుబాటు నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్ సాయ్‌ స్పందించారు. దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించడానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దృఢ సంకల్పంతో కృషి చేస్తున్నారని,  దేశంలో నక్సలిజంపై పోరాటం తీవ్రస్థాయిలో కొనసాగుతోందని అన్నారు. వారి కృషి ఫలితంగా దాని ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ఈ నెలతో నక్సలిజం నిర్మూలనకు గడువు దగ్గర పడింది. అందుకే పాపారావు వంటి ప్రముఖ మావోయిస్టు కమాండర్లు లొంగిపోవడం సానుకూల సంకేతం’’ అని  సీఎం విష్ణుదేవ్‌ అన్నారు.

Advertisment
తాజా కథనాలు