Mamata Banerjee : దీదీకి దిమ్మతిరిగే షాక్.. నిన్న MLAలు, ఈ రోజు MPలు!

మమతా బెనర్జీ  నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌ కు మరో బిగ్ షాక్ తగిలినట్లుగా  కనిపిస్తోంది.  ఆ పార్టీకి  చెందిన కనీసం 20 మంది ఎంపీలు బీజేపీతో టచ్‌లోకి వెళ్లారని, వారు త్వరలోనే పార్టీ మారే యోచనలో ఉన్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

New Update
mamata

మమతా బెనర్జీ  నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌ కు మరో బిగ్ షాక్ తగిలినట్లుగా  కనిపిస్తోంది.  ఆ పార్టీకి  చెందిన కనీసం 20 మంది ఎంపీలు బీజేపీతో టచ్‌లోకి వెళ్లారని, వారు త్వరలోనే పార్టీ మారే యోచనలో ఉన్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించిన చర్చలు ఇప్పటికే అగ్రనాయకత్వాల స్థాయిలో జరుగుతున్నాయని, పార్టీ మారేందుకు సదరు ఎంపీలు తీవ్ర ఆసక్తిని కనబరుస్తున్నారని సమాచారం.

ప్రస్తుతం పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో కలిపి తృణమూల్ కాంగ్రెస్‌కు మొత్తం 41 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో 28 మంది లోక్‌సభలో, 13 మంది రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకవేళ ఊహిస్తున్నట్లే ఈ ఎంపీలు గనుక పార్టీ మారితే, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత  మమతా బెనర్జీకి ఇది కోలుకోలేని పెద్ద దెబ్బ అవుతుంది.  ప్రతిపక్ష కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ రెండో అతిపెద్ద పార్టీగా ఉంది. ఇప్పుడు గనుక ఆ పార్టీలో తిరుగుబాటు వస్తే, అటు తృణమూల్ కాంగ్రెస్‌తో పాటు ఇటు పార్లమెంట్‌లో ప్రతిపక్షాల బలం కూడా ఘోరంగా పడిపోతుంది.

బెంగాల్ అసెంబ్లీలో తృణమూల్ లెజిస్లేచర్ పార్టీ ఇప్పటికే రెండు ముక్కలైంది. ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని 60 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందం తామే అసలైన తృణమూల్‌ అని ప్రకటించుకుంది. ఈ వర్గం రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా ఎన్నుకోగా, దానికి అసెంబ్లీ స్పీకర్ కూడా ఆమోదం ముద్ర వేశారు. మమతా బెనర్జీపై బహిరంగంగానే తిరుగుబాటు చేసిన ఈ వర్గం, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి కోసం మమతా బెనర్జీ ఎంపిక చేసిన అభ్యర్థిని కూడా సవాల్ చేసింది.

తిరుగుబాటు సెగలు

 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచే ఈ తిరుగుబాటు సెగలు మొదలయ్యాయి. అవినీతి, అలాగే ఆర్.జి. కర్ వైద్యురాలి అత్యాచారం-హత్య కేసును పార్టీ హ్యాండిల్ చేసిన విధానం వంటి అంశాలపై పలువురు నేతలు పార్టీని బహిరంగంగానే తప్పుబట్టారు. గత వారం ముఖ్యమంత్రి సువేందు అధికారి ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా చాలా మంది నేతలు హాజరయ్యారు.

దీంతో ఇప్పుడు మమతా బెనర్జీ దృష్టంతా తన పార్టీ పేరును, గుర్తును ఎలాగైనా కాపాడుకోవడం పైనే పడింది. అయితే మహారాష్ట్రలో జరిగిన రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే, ఈ పని చేయడం మమతా బెనర్జీకి అంత తేలికైన విషయంగా కనిపించడం లేదు. పార్టీ వ్యవస్థలు వేగంగా కుప్పకూలిపోవడం, ప్రతిపక్ష నేత పదవిని కోల్పోవడం, అలాగే ఫిర్హాద్ హకీమ్ వంటి కీలక నేత రాజీనామా చేయడం వంటి పరిణామాలు మమతా బెనర్జీపై తీవ్రమైన ఒత్తిడిని పెంచాయి. తన రాజకీయ పార్టీపై పట్టును నిలుపుకోవడానికి ఆమె ఇప్పుడు పెద్ద పోరాటమే చేయాల్సి వస్తోంది. 

Advertisment
తాజా కథనాలు