రతన్ టాటాకు అమెరికాలో అవమానం.. ఇండియాలో ప్రతీకారం

టాటా కంపెనీ నష్టాల్లో ఉన్న సమయంలో అమెరికన్ కంపెనీ ఫోర్డ్కు విక్రయించాలని రతన్ టాటా అనుకున్నారు. ఆ కంపెనీ చైర్మన్ బిల్ ఫోర్డ్ తో సమావేశమయ్యారు. ఇండియన్స్ కు కార్లతయారు చేయడం గురించి ఏం తెలుసని పంపించేశారు. అలాంటి పరిస్థితే ఫోర్డ్ కు రావడంతో టాటాను కలిసారు.

New Update
Ratan Tata

వ్యాపార రంగం అభివృద్ధిలో రతన్ టాటా కీలక పాత్ర పోషించారు. ఆటోమొబైల్ సహా మరెన్నో రంగాల్లో విజయాలు సాధించి దూసుకుపోయారు. అయితే టాటా కంపెనీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న రతన్ టాటా రెండు దశాబ్దాలు శ్రమించి టాటా గ్రూప్ కంపెనీలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారు. అంతేకాకుండా భారతదేశానికి సైతం మంచి పేరు గుర్తింపు సంపాదించారు. అయితే ఎన్నో విజయాలు సాధించిన రతన్ టాటాకు ఓ సమయంలో చేదు అనుభవం ఎదురైంది.

అదీ విదేశాల్లో ఓ వ్యక్తి రతన్ టాటాను ఘోరంగా అవమానించారు. ఆ అవమానాన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని మరింత ఉన్నత స్థాయికి ఎదిగారు. ఒకానొక సమయంలో తమ కార్ల కంపెనీ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో ఏం చేయాలో తెలియక అమెరికా కంపెనీ ఫార్డ్ కు విక్రయించాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే ఫార్డ్ కంపెనీ చైర్మన్ బిల్ ఫార్డ్ తో సమావేశమయ్యారు. అయితే ఆ సమావేశంలో రతన్ టాటాను బిల్ ఫార్డ్ ఘోరంగా అవమానించారు. ఇండియన్స్ కు కార్ల తయారు చేయడం గురించి ఏం తెలుసు అని అన్నాడు.

ఇది కూడా చదవండిః రతన్ టాటా కలలుగన్న నానో కారు.. ఫెయిల్యూర్ ఎందుకైందో తెలుసా?

ప్యాసింజర్ కార్లు తయారు చేయడం ఎందుకు ప్రారంభించారని.. మీ కంపెనీ కొనుగోలు చేయడమంటే మీపై నేను ఉపకారం చేయడమే అవుతుందని బిల్ ఫార్డ్ అన్నాడు. దీంతో రతన్ టాటా రగిలిపోయాడు. అతడి మాటలు గుండెల్లో పెట్టుకున్నాడు. ఇండియా వచ్చి తన కంపెనీని అమ్మకూడదనుకున్నాడు. అనంతరం 9ఏళ్లలో కార్ల బిజినెస్ అత్యంత విజయవంతంగా ముందుండి నడిపించాడు. అయితే ఎవరైతే రతన్ టాటాను అవమానించారో వాళ్లే మళ్లీ తనవద్దకు వచ్చేలా చేశాడు. బిల్ ఫార్డ్ కంపెనీ ఈసారి కష్టాల్లో పడింది.

అవమానించిన వ్యక్తే ప్రశంసించాడు

బ్రిటీష్ లిల్యాండ్ అనే కంపెనీని దాదాపు 2.5 బిలియన్ డాలర్లకు కొని నష్టపోయాడు. దీంతో తన కార్ల కంపెనీని విక్రయించాలని నిర్ణయించుకుని.. అటు ఇటు తిరిగి చివరికి రతన్ టాటా వద్దకు వచ్చాడు. తన వద్ద ఉన్న జాగ్వర్, ల్యాండ్ రోవర్ వంటి లగ్జరీ కార్ బ్రాండ్లను విక్రయించాలనుకుంటున్న చెప్పాడు. అయితే రతన్ టాటా మాత్రం బిల్ ఫార్డ్ లా నో చెప్పలేదు. నష్టాల్లో ఉన్నా ఆ లగ్జరీ కార్లను కొనుగోలు చేసి తన మంచి మనసు చాటుకున్నారు. ఆయన మంచి మనసుకు బిల్ ఫార్డ్  చేతులెత్తి మొక్కాడు.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు