/rtv/media/media_files/2025/03/20/Dqws0jdA6Mif8bpQGlRu.jpg)
శంకుస్థాపన కార్యక్రమంలో అస్సాం రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే రెచ్చిపోయాడు. అందరూ చూస్తున్నారని కూడా తెలిసి కూడా ఓ కాంట్రాక్టు ఉద్యోగిని చితకబాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకు ఏం జరిగిదంటే.. AIUDF ఎమ్మెల్యే షంసుల్ హుడా మార్కెట్ వద్ద వంతెన శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యాడు. శంకుస్థాపన కార్యక్రమానికి జరిగిన ఏర్పాట్లపై హుడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. రిబ్బన్ రంగు, అరటి చెట్ల పరిమాణం చిన్నగా ఉండటంతో కోపానికి గురయ్యాడు. రిబ్బన్ కటింగ్ వేడుక కోసం పొడవైన అరటి మొక్కలకు, ఎరుపు రిబ్బన్ కట్టాలని ఎమ్మెల్యే ముందుగా కాంట్రాక్టు ఉద్యోగిని ఆదేశించాడు. అయితే కాంట్రాక్టర్ ఒకటిన్నర అడుగుల పొడవైన అరటి మొక్కలకు గులాబీ రంగు రిబ్బన్‌ను ఏర్పాటు చేశాడు.
Bilasipara East MLA Shamsul Huda publicly assaulted a contractor's clerk, Sahidur Rahman, with a banana plant during a bridge inauguration at Daikhowa Market!
— The Assam Tribune (@assamtribuneoff) March 19, 2025
The act was caught on camera and has since gone viral, sparking massive outrage.
Witnesses were left stunned as the… pic.twitter.com/tnhqtIYp2Z
కాంట్రాక్టర్ ఉద్యోగిపై దాడి
దీంతో ఎమ్మెల్యే రిబ్బన్‌ను కత్తిరించడానికి వంగి చేయాల్సి రావడంతో తన కోపాన్ని వెంటనే పక్కన నిలబడి ఉన్న కాంట్రాక్టర్ ఉద్యోగిపై ప్రదర్శించాడు. ఉద్యోగి కాలర్ పట్టుకుని లాగి గట్టిగా కొట్టాడు. అంతటితో ఆగలేదు. అరటి మొక్కను పెకిలించి దానితోనూ కొట్టాడు. అక్కడే నిలబడి ఉన్నవారు సదరు ఎమ్మెల్యేను ఆపడానికి ప్రయత్నించారు. కాంట్రాక్టర్ అవినాష్ అగర్వాలా ఏర్పాటులో జరిగిన లోపాలపై ఎమ్మెల్యేకు తరువాత క్షమాపణలు కోరారు. ఎమ్మెల్యే చర్యపై తీవ్ర విమర్శలు రావడంతో ఆయన కూడా సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పారు. శంకుస్థాపన కార్యక్రమంలో కొబ్బరికాయలు పగలగొట్టడానికి రాళ్ళు కూడా ఇవ్వలేదని ఎమ్మెల్యే ఆరోపించారు. కొబ్బరికాయలు పగలగొట్టడానికి రాళ్ళు కోసం దాదాపు అరగంట పాటు వేచి ఉండాల్సి వచ్చిందని ఆయన అన్నారు.
Also Read : చిరంజీవి లండన్ పర్యటనలో గోల్‌మాల్.. డబ్బులు వసూలు చేసిన కేటుగాళ్లు!