Delhi: ఢిల్లీలో విపరీతమైన కాలుష్యం..యమునానదిలో విషపు నురుగు

ఎప్పటిలానే ఈ ఏడాది కూడా దీపావళి ముందు ఢిల్లీలో విపరీంగా కాలుష్యం పెరిగిపోయింది. కాళింది కుంజ్ ప్రాంతంలో యుమునానదిలో విషపు నురుగు తూలుతూ కనిపించింది. దానికి తోడు ఢిల్లీలో వాయు కాలుష్యం కూడా ఇండెక్స్ 293కు చేరుకుంది. 

author-image
By Manogna alamuru
New Update
11

Delhi Polution: 

ఢిల్లీలో దీపావళికి ముందు కాలుష్యం బాగా పెరిగిపోతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే. చుట్టు పక్కల రాష్ట్రాల్లో క్రాప్స్ తగులబెట్టడం..మరికొన్ని ఇతర కారణాల వలన ఇప్పటి నుంచి జనవరి వరకూ ప్రతీ ఏడాది ఢిల్లీ కాలుష్యం చెప్పలేని స్థాయిలో ఉండి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ దీపావళికి టపాసులను కాల్చడం ఎప్పుడూ నిషేధిస్తారు. ఈ ఏడాది కూడా ఈ నిషేధం ఉంది. అయితే ఈ ఏడాది ఇంకా చాలా ముందుగానే కాలుష్యం తారాస్థాయికి చేరుకుంది. ఢిల్లీ గాలిలోని నాణ్యత బాగా క్షీణించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోయిందని ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండ‌లి చెబుతోంది.  సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం.. ఎన్‌సీఆర్‌లో ఘజియాబాద్‌లో 265, నోయిడాలో 243, గ్రేటర్ నోయిడాలో 228 సహా పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత పూర్తిగా పడిపోయింది. గాలి నాణ్యత 400 కన్నా తక్కువ ఉంటే ఆన్ని తీవర వాయు కాలుష్యంగా పరిగణిస్తారు. 

Also Read: TN: హిందీని రుద్దకండి..మళ్ళీ రాజుకున్న వివాదం..మోదీకి స్టాలిన్ లేఖ

నీటి కాలుష్యం..

అయితే ఈసారి ఢిల్లీకి మరో ఆందోళనకర విషయం యాడ్ అయింది. ఎప్పుడూ కేవలం గాలిలో మాత్రమే కాలుష్యం ఉంటుంది. కానీ ఈ ఏడాది నీటి కాలుష్యం కూడా విపరీతంగా ఉందని తెలుస్తోంది. ప్ర‌శాంతంగా బ‌య‌ట‌కు వ‌చ్చి ఊపిరి తీసుకునేందుకు భ‌య‌ప‌డుతోన్న ప్ర‌జ‌లు ఇప్పుడు చుక్క నీటితో గొంతు త‌డిపేందుకు కూడా జంకుతున్నారు. ప‌ర‌వ‌ళ్లు తొక్కే యమునా నదిలో పెద్ద ఎత్తున నురగలు రావడం ఆందోళనగా మారింది. ప్రస్తుతం ఢిల్లీలోని కాళింది కుంజ్ ప్రాంతాలోని యమునానదిలో నీరు కన్నా విషపు నురుగు ఎక్కువగా ఉంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కూ వర్షాలు బాగా కురవడంతో నదిలో గతంలో కంటే ఆక్సిజన్‌​​స్థాయి ఎక్కువైంది. దీంతో పాటు నదిలో ఫీకల్ కోలిఫాం స్థాయి కూడా అధిక‌మైంద‌ని తేలింది. దీనికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసి పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: మీరెవర్ని చంపినా , ఎంతమందిని చంపినా తగ్గేదే లేదు..హమాస్ సంచలన ప్రకటన

ప్రమాదస్థాయిలో నురుగు..

య‌మునా నదిలో క‌నిపిస్తోన్న  తెల్ల‌ని నుర‌గ‌కు ప్ర‌ధాన కార‌ణం చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద పరిశ్రమల నుంచి వెలువ‌డుతున్న ర‌సాయ‌నక వ్య‌ర్థాలేన‌ని చెబుతున్నారు. వీటితో  భూగ‌ర్భ జ‌లాలు విపరీతంగా కలుషితం అవుతున్నాయి. దీని వలన ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఆనారోగ్యాల పాలవుతున్నారు.  క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధుల బారిన ప‌డుతున్నారని పర్యావరణ వేత్తలు, కాలుష్య నియంత్రణ కమిటీ చెబుతున్నారు. ఢిల్లీలో ఈ ఏడాది సెప్టెంబరులో యమునా నదిలోని అన్ని ప్రాంతాల నుంచి నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. య‌మునా నదిని కాలుష్య కోర‌ల్లోంచి ర‌క్షించ‌క‌పోతే చాలా ప్ర‌మాదంగా మారుతుంద‌ని హెచరిస్తున్నారు.

Also Read: Byju's: కోట్ల నుంచి సున్నాకు..బైజూస్ పతనం

Also Read: Stock Market:ఎట్టకేలకు లాభాల్లో సూచీలు..కాస్త మెరుగ్గా మార్కెట్

Advertisment
Advertisment
తాజా కథనాలు