/rtv/media/media_files/2026/06/16/nagapur-2026-06-16-14-51-55.jpg)
ముంబైలో దారుణం జరిగింది. నాగ్‌పూర్‌లోఐఏఎఫ్ అధికారి భార్యపై జరిగిన దారుణం తీవ్ర కలకలం రేపుతోంది. తన పాత క్లాస్‌మేట్, అతని స్నేహితులు తనపై అత్యాచారం చేశారని, బ్లాక్‌మెయిల్ చేస్తూ క్షుద్రపూజలు, బలవంతపు మత మార్పిడికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘోరానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడు అయాజ్ మదారేతో పాటు అతనికి సహకరించిన అమీన్ షేక్ అనే మరో వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అంతేకాకుండా, ఈ మత మార్పిడి వ్యవహారంలో సంబంధం ఉన్న మధ్యప్రదేశ్‌కు చెందిన మత పెద్ద కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళితే.. 2025 ఫిబ్రవరి 8న ఒక హోటల్‌లో కలిసిన సమయంలో నిందితుడు అయాజ్, సదరు 24 ఏళ్ల మహిళ తాగే డ్రింక్‌లో మత్తుమందు కలిపాడు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెకు సంబంధించిన అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలు తీసుకున్నాడు. ఆ తర్వాత వాటిని చూపించి, నీ మొగుడికి పంపిస్తా, సోషల్ మీడియాలో పెడతా అంటూ బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఆ భయంతోనే ఆమెపై పలుమార్లు అత్యాచారం చేయడమే కాకుండా, దాదాపు నాలుగు లక్షల రూపాయల డబ్బును కూడా వసూలు చేశాడు.
ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో బాధితురాలు ఏడుస్తూ, నన్ను వదిలేయ్ అని బతిమాలుకుంటున్నా నిందితుడు అయాజ్ వినకుండా ఆమె చేతులను గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు. ఏదో మంత్రాలు చదువుతూ ఆమె మొహంపై ఊదుతున్నాడు. ఆమె అతని పట్టు నుంచి తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. ఆ తర్వాతే తనను మతం మారినట్లు ప్రకటించి, మళ్లీ అత్యాచారానికి ఒడిగట్టారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. నిందితుడు అయాజ్ తరచూ ఒక ప్లాస్టిక్ సీసాలో ఏదో ద్రవాన్ని తెచ్చి ఆమెతో బలవంతంగా తాగించేవాడని, ఉర్దూలో ఏదో మాట్లాడుకుంటూ మొహంపై ఊదేవాడని ఆమె చెప్పింది. ఇది హిప్నాటిజం, చేతబడి అని నమ్మించి తనపై ఈ దారుణానికి పాల్పడేవాడని ఫిర్యాదులో పేర్కొంది.
బలవంతంగా పూజలు
మరో ఘటనలో, మే 31వ తేదీన అయాజ్, అతని స్నేహితుడు కలిసి ఆ మహిళను బలవంతంగా కల్మేశ్వర్ అనే ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రం చింద్వారా జిల్లా తామియా గ్రామానికి చెందిన హజ్రత్ మౌలానా అనే వ్యక్తితో బలవంతంగా పూజలు చేయించారు. ఆమెకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఖుబూల్ హై అని చెప్పించి మత మార్పిడి చేశారు. ఆ తర్వాత ఆమె ముస్లింగా మారిపోయిందని, అయాజ్‌తో ఆమెకు నిఖా జరిగిపోయిందని ఆ మౌలానా ప్రకటించాడు. ఆమెతో బలవంతంగా మాంసం తినిపించి, కల్మా చదివించారు. ఆ తర్వాత మళ్లీ ఒక హోటల్‌కు తీసుకెళ్లి అయాజ్ ఆమెపై అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె ఇంటికి కూడా వచ్చి నిందితులు వేధించేవారని బాధితురాలు తెలిపింది.
ఈ ఘటనపై స్పందించిన నాగ్‌పూర్ పోలీసులు నిందితులపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్, వసూళ్లు, బలవంతపు మతమార్పిడితో పాటు క్షుద్రపూజల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు.
Follow Us