/rtv/media/media_files/2026/06/14/aiadmk-2026-06-14-14-54-24.jpg)
ప్రముఖ సినీ నటి, ఏఐఏడీఎంకే పార్టీ ప్రచార విభాగం ఉప కార్యదర్శి గౌతమి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామికి పంపించారు.
గౌతమి రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. ఆమె గతంలో దాదాపు రెండు దశాబ్దాల పాటు బీజేపీలో కొనసాగారు. అయితే పార్టీ నాయకత్వం నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదంటూ అక్టోబర్ 2023లో బీజేపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 14, 2024న పళనిస్వామి సమక్షంలో ఏఐఏడీఎంకే పార్టీలో చేరారు. కాగా, ఇటీవల జరిగిన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రాజపాళయం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు గౌతమి పార్టీ టికెట్ ఆశించారు. అయితే పార్టీ నాయకత్వం ఆమెకు పోటీ చేసే అవకాశం కల్పించలేదు.
Actor #GautamiTadimalla on Sunday resigned from the #AIADMK, stepping down both as a primary member of the party and as its deputy propaganda secretary, citing prevailing political circumstances. https://t.co/JRDqRFQCSg#DTNext#TamilNadu#Gautami#AIADMK#TNPolitics#TVKpic.twitter.com/kkiw3OMINd
— DT Next (@dt_next) June 14, 2026
పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ
ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఏఐఏడీఎంకే పార్టీ తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు అధికార పార్టీ అయిన తమిళగ వెట్రి కజగం వైపు క్యూ కడుతున్నారు. శనివారం రోజే పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో సహా వందలాది మంది టీవీకే పార్టీలో చేరారు. ఇలాంటి క్లిష్ట సమయంలో స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న నటి గౌతమి కూడా ఏఐఏడీఎంకేను వీడటం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారడమే కాకుండా, స్థానిక రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Follow Us